/rtv/media/media_files/2024/11/23/watchingmobile41.jpeg)
ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు సోషల్ మీడియాలో గంటల కొద్ది గడుపుతున్నారు. ముఖ్యంగా యువతి, యువకుల్లో ఇన్స్టాగ్రామ్ వాడకం మరింత పెరిగిపోయింది.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile61.jpeg)
అయితే ఈరోజుల్లో టీనేజ్ పిల్లలను సోషల్ మీడియా నుంచి కాపాడుకోవడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. పిల్లలకు ఆన్లైన్ కనెక్టివిటీ అనేది కొంతవరకు ఉపయోగకారమే. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చూడకూడని కంటెంట్‌కు గురవడం ఆందోళన కలిగించే విషయం.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile81.jpeg)
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా, సురక్షితంగా ఉంచడానికి తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/media_files/2024/11/23/watchingmobile31.jpeg)
క్వైట్ మోడ్
క్వైట్ మోడ్ అనేది పిల్లల హద్దులను సెట్ చేయడానికి గొప్ప ఫీచర్. ఈ ఫీచర్ నోటిఫికేషన్ లను 12 గంటల వరకు మ్యూట్ చేయడంలో సహాపడుతుంది. తద్వారా పిల్లలు చదివేటప్పుడు లేదా రాత్రి సమయాల్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. అంతేకాదు ఈ క్వైట్ మోడ్ లోని ఆటో- రిప్లై ఫీచర్ మెసేజ్ పంపడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ సందేశాలను కూడా పంపుతుంది. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి ఈ చాలా బాగా ఉపయోగపడుతుంది.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile51.jpeg)
నైట్ నడ్జ్
కొంతమంది యువకులు, పిల్లలు రాత్రి పడుకునే సమయంలో కూడా మొబైల్ చూసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు రాత్రి పూట నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/23/watchingmobile81.jpeg)
ఇలాంటి సమయంలో తల్లి దండ్రలు మొబైల్స్ లో నైట్ నడ్జ్ ఫీచర్ ఆన్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ ఫీచర్ పడుకోవాలని గుర్తుచేస్తూ పదే రిమైండర్స్ పంపుతుంది. రాత్రి సమయాల్లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ చూస్తే 10 నిమిషాలకు ఒకసారి రిమైండర్ సెండ్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/23/58oA0Y2aRrkfp5uyBaIF.jpg)
టేక్ ఎ బ్రేక్ ఫీచర్
ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే ఎంత సమయం దాంట్లో గడిపేస్తారో కూడా తెలియదు. దీని కోసం పిల్లల ఫోన్స్ లో టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌ని ఆన్ చేయాలి. పిల్లలు గంటల కొద్ది ఫోన్ చూస్తూనే ఉన్నప్పుడు.. ఈ ఫీచర్ వారికి బ్రేక్ తీసుకోవాలని గుర్తుచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'డైలీ లిమిట్' అనే పేరుతో ఈ ఫీచర్ ఉంటుంది. పై ఫీచర్లు అన్ని పిల్లలు రీసెట్ చేయడానికి, ఫోకస్ చేయడంలో సహాయపడతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Mobile-6-scaled.jpg)
రిస్టిక్టెడ్ మోడ్
పిల్లలు వాడే మొబైల్ ఫోన్స్ ఈ రిస్టిక్టెడ్ మోడ్ ఫీచర్ ని తప్పనిసరిగా ఆన్ చేయాలి. దీని వల్ల వారు చూడకూడని కంటెంట్ ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు.