/rtv/media/media_files/2025/07/13/bhagyashri-borse-with-nani-2025-07-13-18-15-41.jpg)
Bhagyashri Borse with nani
Nani Paradise: నేచరల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న హై వొల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది పారడైస్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఇందులో నాని, ఇతర నటీ నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
భాగ్య శ్రీ
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరోయిన్ గా నటించబోయేది ఎవరా? అనే దానిపై భారీ సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో తాజా అప్డేట్ ప్రకారం.. 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సె నాని జోడిగా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#BhagyashriBorse is at the TALKS To Play Female LEAD Opposite @NameisNani in #TheParadise 🥵🔥📈
— OTT STREAM UPDATES (@newottupdates) July 12, 2025
An #Anirudh MUSICAL🎸
An #SrikanthOdela FILM📽️#Nani As Protagonist#RaghavJuyal As Antagonist
Releasing WORLDWIDE From MARCH 26th 2026⚔️🌋 pic.twitter.com/PILEDlUKBY
నటి భాగ్యశ్రీకి హిట్లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమా మిస్టర్ బచ్చన్ ఆశించిన స్తాయిలో విజయం సాధించలేదు. ఆయనప్పటికీ తన గ్లామర్, నటనతో ఆడియన్స్ ని ఫిదా చేసింది. ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ కింగ్ డం, దుల్కర్ సల్మాన్ తో మరో సినిమా చేస్తోంది. వీటితో పాటు అఖిల్ లెనిన్ సినిమాలో శ్రీలీల స్థానాన్ని కూడా ఈ బ్యూటీనే భర్తీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.