OG Pre Release Event: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఈనెల 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూవీ ప్రీ రిలీజ్ నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ కి పవన్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఈవెంట్ మొదలైన కొద్దిసేపటికే వర్షం పడడంతో.. కాసేపు ఆగిపోయింది. అయినప్పటికీ ఫ్యాన్స్ అక్కడే ఉండి పవన్ స్పీచ్ కోసం ఎదురుచూశారు.
పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో అడుగుపెట్టగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. చేతిలో కత్తి పట్టుకొని సినిమాటిక్ స్టైల్లో వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు. వర్షంలోనే అభిమానుల కోసం పవన్ తన స్పీచ్ కంటిన్యూ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ సుజిత్, మ్యూజిక డైరెక్టర్ తమన్ ని అభినందించారు. అలాగే సుజిత్ కి తనపై ఉన్న అభిమానం గురించి , అతడి వర్క్ గురించి మాట్లాడారు.
OG Cults...
— Janasena Visakhapatnam (@JSPForVizag) September 21, 2025
As the #OGPreReleaseEvent is expected to witness a massive crowd this evening,
Please co-operate with police & organizers.
Let’s celebrate our Power Star @PawanKalyan garu’s #TheyCallHimOG Pre Release Event in the safest & grandest way 💚🫂 pic.twitter.com/E0ZLmM3TBB
పవన్ స్పీచ్
పవన్ స్పీచ్ అనంతరం ట్రైలర్ లాంచ్ చేశారు. అంచనాలకు తగ్గట్లే 'ఓజీ' ట్రైలర్ అదిరిపోయింది. పవన్ డైలాగ్స్, మాస్ యాక్షన్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. ట్రైలర్ వస్తున్నంత సేపు స్టేడియం అంతా అరుపులు, కేకలతో మారుమోగింది. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఎంట్రీలు హైలైట్ గా అనిపించాయి. మొత్తానికి 'ఓజీ' మంచి రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న రెండవ సినిమా ఇది. మొదటి సినిమా హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను సంతోష పెట్టలేకపోయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ పైనే ఉన్నాయి. DVV బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ జోడీగా నటించారు. యాక్షన్ తో పాటు ఇందులో పవన్ రొమాంటిక్ సైడ్ కూడా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. 'సువ్వి సువ్వి' సాంగ్ లో పవన్- ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'ఓజీ' లో తమన్ బీజీఎమ్ , మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
Follow Us