NTRNEEL: ఎన్టీఆర్ లుక్ చేంజ్.. ఒక్క ఫొటోతో రూమర్స్‌కి చెక్!

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న “డ్రాగన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ఆగిందని వచ్చిన రూమర్స్‌కి మేకర్స్ విడుదల చేసిన ఫొటోతో చెక్ పెట్టేశారు. నీల్ స్వయంగా ఎన్టీఆర్ లుక్‌పై పని చేస్తున్నాడు. రెండో షెడ్యూల్ ఈ నెల చివర్లో యూరప్‌లో జరగనుంది.

New Update
NTRNEEL

NTRNEEL

NTRNEEL: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రారంభం నుంచే భారీ హైప్ సొంతం చేసుకుంది. ‘కెజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ విజయాల తర్వాత నీల్ తీస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇదే కాకుండా, ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో ఆసక్తి మరింత పెరిగింది.

‘డ్రాగన్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, రెండో షెడ్యూల్‌ను ఈ నెల చివర్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో యూరప్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల షూటింగ్ ఆగిపోయిందని, ఎన్టీఆర్ లుక్ మారిందని సోషల్ మీడియాలో పలు రూమర్స్ వినిపించాయి. కొందరు అభిమానులు కూడా ఆయన లుక్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మరీ లీన్‌గా ఉన్నాడని కామెంట్లు రావడంతో, సినిమా పరిస్థితి ఏమైందో అనే సందేహాలు మొదలయ్యాయి.

అయితే ఆ గాసిప్స్ అన్నిటికి సమాధానంగా మేకర్స్ ఒకే ఒక్క ఫొటో రిలీజ్ చేశారు. ఆ స్టిల్‌లో సెలూన్‌లో ఎన్టీఆర్‌కి దగ్గరగా నిలబడి ప్రశాంత్ నీల్ స్టైలింగ్ చేస్తున్నట్టు కనిపించాడు. ఆ ఒక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం “టైగర్ వేటకు సిద్ధమవుతున్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ntr neel
ntr neel

ఈ ఫొటోతో అన్ని రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడింది. ఎన్టీఆర్ లుక్‌పై ప్రశాంత్ నీల్ స్వయంగా పని చేస్తున్నాడని స్పష్టమైంది. ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా తమ పని చేస్తూ, గాసిప్స్‌కు స్పందించకుండా ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ఇటీవల ఆఫ్రికాకు వెళ్లి కొన్ని కీలక లొకేషన్స్‌ పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. ఆ ట్రిప్ తర్వాత సినిమా రెండో షెడ్యూల్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఈసారి చాలా షార్ప్, లీన్ లుక్‌లో కనిపించనున్నాడని తెలిసింది.

‘డ్రాగన్’ను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని టాక్. యాక్షన్‌, ఎమోషన్‌, స్టైలిష్ లుక్‌లతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించబోతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

మొత్తం మీద, ఆ ఒక్క ఫొటోతోనే మేకర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టి, సినిమాపై హైప్‌ను మళ్లీ పెంచేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో నుంచి వచ్చే ఈ మాస్ ట్రీట్‌పైనే ఉంది.

Advertisment
తాజా కథనాలు