Devara Trailer: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'దేవర' ట్రైలర్..!

ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా సొంతం చేసుకుంది. ఇండియా #1, కెనడా #6, USA #5, ఆస్ట్రేలియా#8 ట్రెండింగ్ లో కొనసాగుతూ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది.

New Update
devara trailer

devara trailer

Devara Trailer:  ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్‌ను దాటేసిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. USA ప్రీమియర్స్ కి ఇంకా 18 రోజులు ఉండగానే రికార్డు స్థాయిలో 25000 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి.

ట్రెండింగ్ లో 'దేవర' ట్రైలర్

ఇంతటితో 'దేవర' ర్యాంపేజ్ పూర్తవలేదు. తాజాగా విడుదలైన 'దేవర' ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకు పైగా వ్యూస్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే వరల్డ్ వైడ్ గా 55 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇండియా #1, కెనడా #6, USA #5, ఆస్ట్రేలియా#8 ట్రెండింగ్ లో కొనసాగుతూ దుమ్మురేపుతోంది. దీంతో గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్, విజువల్స్, డైలాగ్స్, Vfx హైలైట్ గా నిలిచాయి. తారక్ ద్విపాత్రాభినయం సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది. 'దేవర' తో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరగనున్నట్లుగా అర్థమవుతోంది. 

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన 'దేవర' రెండు భాగాలుగా విడుదల కానుంది. 'దేవర' పార్ట్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.