Nivetha Thomas: నివేథా.. టాప్ లేపిందిగా! దెబ్బకు సోషల్ మీడియా షేక్ అంతే..!

నటి నివేథా థామస్ శారీలో కొత్త ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ ట్రెడిషనల్, క్లాసీ లుక్‌తో ఆమె ఫ్యాన్స్‌ను కట్టిపడేసారు, ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లైక్స్, షేర్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

New Update
Nivetha Thomas

Nivetha Thomas

Nivetha Thomas: టాలీవుడ్ లో తన అందం, ప్రతిభతో అందరి మనసు దోచిన నటి నివేథా థామస్ సోషల్ మీడియాలో తాజాగా మరోసారి హల్‌చల్ సృష్టించింది. తన ఫ్యాన్స్ కోసం సరికొత్త, స్టైలిష్ పోస్టులు చేయడం ఆమెకు అలవాటు. తాజాగా నివేథా శారీలో ఒక అందమైన ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె చూపు, హావభావాలు, లుక్ చాలా డిఫరెంట్‌గా, క్లాసీగా ఉంది.

నివేథా నటించిన ‘నాని జెంటిల్‌మన్’, ‘నిన్ను కోరి’, ‘వకీల్ సాబ్’, ‘35’ వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసాయి. సహజమైన నటన, స్టైల్, అభినయం లతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండకపోయినా, ఫొటోను పెట్టిన వెంటనే అది వైరల్ అవుతుంది. తాజా ఫొటో కూడా ఇలానే సోషల్ మీడియా ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.

ఈ ఫొటోలో నివేథా కంప్లీట్ ట్రెడిషనల్ లుక్‌లో ఉంది. సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ కాకుండా, సాఫ్ట్ స్మైల్‌తో తన అందాన్ని మరోసారి చూపించారు. ఫ్యాన్స్ ఫొటోపై పొగడ్తల వర్షం కురిపించారు. “నేచురల్ బ్యూటీ అంటే ఈదే”, “అందానికి అసూయ పుట్టేలా ఉంది”, “ఇప్పటివరకు ఇలాంటి అందం చూడలేదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

నివేథా సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఫొటో, వీడియో, పోస్టు ఆమె ఫ్యాన్స్‌కు సరికొత్త ట్రీట్ లా మారుతుంది. ఈ కొత్త ఫొటోలో ఆమె ట్రెడిషనల్, క్లాసీ స్టైల్స్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించగలదో మరోసారి చూపించారు. ఫ్యాన్స్, ఫాలోవర్స్ క్షణాల్లోనే లైక్స్, షేర్లతో దుమ్ములేపారు.

ఇంతకుముందు కూడా నివేథా అడపాదడపా తన ఫొటోస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈసారి కూడా అదే జరిగింది. స్మార్ట్, స్టైలిష్, ట్రెడిషనల్ లుక్‌లతో మిగతా హీరోయిన్లలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందిన సంగతి ఈ ఫొటోతో మరోసారి స్పష్టమైంది.

అంతేకాక, ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేయడం ఆమె ప్రత్యేకతగా మారింది. ఇలా ఆమె చిన్నచిన్న పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెద్ద హిట్‌గా మారడం విశేషం.

Advertisment
తాజా కథనాలు