The Paradise: ‘ది ప్యారడైజ్’ మాస్ మ్యూజిక్ అప్‌డేట్.. ‘ఆయా షేర్’ పాట రిలీజ్ డేట్ ఫిక్స్!

నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల్ కాంబోలో వచ్చే ‘ది ప్యారడైజ్’ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 24న ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’ రిలీజ్ కానుంది, గిరిజనుల సామాజిక పోరాటంపై నాని పవర్‌ఫుల్ పాత్రలో, సినిమా ఆగస్టు 21, 2026న విడుదల కానుంది.

New Update
The Paradise

The Paradise

The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ‘దసరా’ సినిమా తర్వాత వీరిద్దరి కలయిక మరింత స్పెషల్ గా మారింది.

అయితే తాజా అప్‌డేట్ ఏంటంటే ఇంట్రడక్షన్ సాంగ్ ‘ఆయా షేర్’ ఫిబ్రవరి 24, 2026న రిలీజ్ కానుంది అని ప్రకటించారు. ఈ పాట రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతంతో, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీతో భారీ సెట్‌లో షూట్ అయింది. వందల మంది జూనియర్ ఆర్టిస్టుల ఎనర్జీతో ఈ పాట థియేటర్లలో హల్చల్ చేయనుందని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

Nani The Paradise First Single

సినిమా కథనం సామాజిక అంశాల మీద ఆధారపడి ఉంది. వెనుకబడిన గిరిజన తెగ సమస్యలపై పోరాడుతూ వారి కోసం వ్యవస్థకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే నాయకుడిగా నాని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

కథానాయికగా కాయాదు లోహర్‌, కీలక పాత్రల్లో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రం మొదట మార్చి 26, 2026న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం మేకర్స్ నిర్ణయం మార్చి, ఆగస్టు 21, 2026కి వాయిదా వేసారు. ఆగస్టు విండోలో ఉండే పండుగలు సినిమా కలెక్షన్‌కు ప్లస్ అవుతాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు