/rtv/media/media_files/2025/11/17/nagarjuna-shiva-4k-2025-11-17-10-49-16.jpg)
Nagarjuna Shiva 4k
Nagarjuna Shiva 4k: అక్కినేని నాగార్జున తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో మంచి హంగామా సృష్టిస్తోంది. ఎప్పటిలాగే అందం, స్టైల్ కలిపిన లుక్‌తో నాగార్జున మళ్లీ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటున్నారు. నల్ల రంగు షర్ట్, జీన్స్‌తో సింపుల్‌గా కనిపించినప్పటికీ, ఆయనలో కనిపించే స్వాగ్ మాత్రం అసలు తగ్గలేదు. గాగుల్స్, స్మార్ట్ బియర్డ్, పక్కనే ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ -ఇవన్నీ ఆయనకు ఒక క్లాసిక్, రగ్గ్డ్ వైబ్ తీసుకొచ్చాయి.
ఈ లుక్ చూసిన వెంటనే అభిమానులు అందరూ మళ్లీ శివ స్టైల్ గుర్తొచ్చింది అంటున్నారు. అవును, నాగార్జున 1989లో చేసిన కల్ట్ క్లాసిక్ శివ సినిమాలోని ఆ యంగ్ & ఇంటెన్స్ లుక్‌కి ఇది దగ్గరగా ఉందని చాలా మంది చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా 4K రీమాస్టర్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదలై మంచి స్పందన పొందుతోంది. పాత అభిమానులతో పాటు యువత కూడా ఈ సినిమాను థియేటర్‌లకు రప్పిస్తోంది.
Nagarjuna Latest Photo Shoot
అన్నపూర్ణ స్టూడియోస్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోషూట్ ఫొటోలు షేర్ చేస్తూ, "89 వీధుల నుంచి 2025 హృదయాల వరకూ… నాగార్జున గారి అద్భుతమైన ఓరా ఎప్పటికీ తగ్గదు. స్టైల్, అట్రాక్షన్, స్వాగ అన్ని కలిపి ఇవిగో ఆయన తాజా లుక్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
‘శివ 4K రీమాస్టర్’ బాక్సాఫీస్ సూపర్ రిస్పాన్స్
నాగార్జున నటించిన శివ ప్రస్తుతానికి 4K రీమాస్టర్ రూపంలో మళ్లీ విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అమల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఇలైయారాజా సంగీతం అందించారు. రీమాస్టర్ పనులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించింది.
రిసెంట్‌గా విడుదలైన బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ రీమాస్టర్ వెర్షన్ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹3.95 కోట్లు రాబట్టింది. అందులో నార్త్ అమెరికా నుంచి మాత్రమే $50,000 వసూలైంది. రీమాస్టర్ సినిమాలు అమెరికాలో వచ్చే కలెక్షన్స్ సాధారణంగా తక్కువే, కానీ శివ 4K అంచనాలను మించి రికార్డ్‌లు క్రియేట్ చేసింది.
రివైండ్ రిపోర్ట్స్ ప్రకారం, మొత్తం రన్‌లో శివ 4K అమెరికాలో $15,000 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రూపాయల్లో లెక్కేస్తే ఇది 50 లక్షల పైగా అన్నమాట ఒక రీమాస్టర్ సినిమాకు ఇది నిజంగా గొప్ప విజయం. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా వచ్చిన ఈ ఫోటోషూట్ లుక్ ఆయనకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదనే విషయాన్ని మరోసారి నిరూపించింది.
Follow Us