/rtv/media/media_files/2026/01/13/mana-shankara-vara-prasad-garu-2026-01-13-18-49-46.jpg)
MSG Chiranjeevi Remunaration
MSG Chiranjeevi Remunaration: సంక్రాంతి పండగ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ సత్తా చాటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన “మన శంకర వరప్రసాద్ గారు” జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సినిమా తొలి రోజు నుంచే థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
చిరంజీవి ఈ చిత్రంలో తన వింటేజ్ స్టైల్‌లో నటన, డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత అభిమానులు వింటేజ్ చిరు మాస్ లుక్, డ్యాన్సులను థియేటర్లలో మళ్లీ చూసి ఆనందపడుతున్నారు. సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ విక్టరీ వెంకటేష్ చేసిన 20 నిమిషాల గెస్ట్ రోల్. ఆయన కామెడీ, ఎమోషన్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమా విజయానికి కీలకంగా మారింది.
MSG Chiranjeevi Remunaration
సినిమా బడ్జెట్ సుమారు రూ.200 కోట్లు, అందులో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ సుమారు రూ.72 కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే, వెంకటేష్ గెస్ట్ రోల్ కోసం సుమారు రూ.10 కోట్ల పారితోషికం అందుకున్నారట. నయనతారకు రూ.6 కోట్లు అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన ప్రతిభకు తగిన విధంగా సుమారు రూ.25 కోట్ల రేంజ్‌లో ఫీజు తీసుకున్నారు. ఇతర నటులు కూడా తగిన స్థాయిలో రెమ్యూనరేషన్ పొందారు.
సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు విస్తృతంగా ఉన్నాయి చిరంజీవి నటన, చిరు-నయనతార కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, వెంకటేష్ గెస్ట్ రోల్. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరీలియో అందించారు.
చిరంజీవి గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే, ఈ సంక్రాంతికి విడుదలైన “మన శంకర వరప్రసాద్ గారు” ఆడియన్స్ కోసం పూర్తి ప్యాకేజీగా నిలిచింది. మొదటి రోజే ఫుల్ పాజిటివ్ బజ్ నెలకొన్నందున, సినిమా సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి చేయనుంది.
అనిల్ రావిపూడి మార్క్ కుటుంబాన్ని ఆకట్టుకునే కథ, ఫ్యామిలీ కామెడీ, మెగా స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి రూపొందించిన ఈ సినిమా, థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. అభిమానులు చిరు మాస్ లుక్, సీన్స్ కోసం మళ్లీ థియేటర్లకు వెళ్తున్నారు.
Follow Us