Mrunal Thakur: పెళ్లి రూమర్స్ పై స్పందించిన మృణాల్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

మృణాల్ ఠాకూర్-ధనుష్ పెళ్లి వార్తలు అబద్ధమని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం మృణాల్ హైదరాబాద్‌లో కొత్త తెలుగు సినిమా పనులు మొదలుపెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపారు. ఇది AA22కా లేక మరో కొత్త ప్రాజెక్ట్‌కా అనేది ఇంకా స్పష్టత లేదు.

New Update
Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ వివాహ వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నటుడు ధనుష్‌ను మృణాల్ పెళ్లి చేసుకోనున్నారని, అది కూడా 2026 ఫిబ్రవరి 14న జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే మృణాల్‌కు దగ్గరగా ఉన్న వర్గాలు ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టంగా ఖండించాయి.

ఈ వార్తల తర్వాత మృణాల్ తన పూర్తి దృష్టిని మళ్లీ సినిమాలపై పెట్టారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. “కొత్త సంవత్సరం, కొత్త కథ, కొత్త ఆరంభం” అని రాస్తూ, తాను హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు. దీంతో ఆమె ఓ కొత్త తెలుగు సినిమా పనులు మొదలుపెట్టిందని అర్థమవుతోంది.

Mrunal Thakur
Mrunal Thakur

ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ఇది అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22 సినిమా గురించి అయి ఉండొచ్చని ఊహించారు. అయితే మరోవైపు, మృణాల్ ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌లో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల ఆమె చెప్పిన కొత్త కథ మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించినదై ఉండొచ్చని కూడా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ అప్డేట్ ఏ సినిమాకు సంబంధించినదో స్పష్టత లేదు. దర్శకుడు ఎవరు, హీరో ఎవరు, ఏ బ్యానర్‌లో సినిమా వస్తుందన్న వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇక విడుదలల విషయానికి వస్తే, మృణాల్ నటించిన హిందీ చిత్రం ‘దో దీవానే షహర్ మే’ ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమెతో పాటు సిద్ధార్థ్ చిత్రవేది నటించారు. అలాగే తెలుగులో అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డకాయిట్’ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది.

ప్రస్తుతం అందరి దృష్టి మృణాల్ చెప్పిన ఆ కొత్త తెలుగు ప్రాజెక్ట్‌పైనే ఉంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Mrunal Thakur
Advertisment
తాజా కథనాలు