Horror Movie: ఆ కోరిక తీర్చమనే దెయ్యం.. మార్చురీ నుంచి లేచి..! ఈ సినిమా చూస్తే ఏమైపోతారో..!

హారర్ కామెడీ థ్రిల్లర్ "మిస్టర్ షుడాయి" ఇప్పుడు చౌపల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో వెంట తన కోరికలు తీర్చమని నాలుగు దెయ్యాలు వెంటపడే కథ ఇది. IMDbలో 9.2 రేటింగ్ సాధించిన ఈ పంజాబీ చిత్రం ఫుల్ వినోదాన్ని పంచుతుంది.

New Update
Horror Movie

Horror Movie

Horror Movie: హారర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తే. భయాన్ని కలిగించేట్టు, నవ్వు పుట్టించేలా ఉంటే అంతకన్నా బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. అలాంటి ప్రత్యేకమైన హారర్ కామెడీ థ్రిల్లర్ మిస్టర్ షుడాయి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ పంజాబీ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ చౌపల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

గత ఏడాది జూన్ 21న విడుదలైన మిస్టర్ షుడాయి ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన అందుకుంది. IMDbలో 9.2 రేటింగ్ సాధించగా, రొట్టెన్ టొమాటోస్‌లో 80% పాజిటివ్ రివ్యూస్ పొందింది. ఈ రేటింగ్‌తో సినిమా మీద మళ్లీ ఆసక్తి పెరిగింది.

సినిమా కథ

సినిమాలో హీరో తన ప్రేమ విఫలమై తీవ్ర నిరాశలో పడిపోతాడు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి జీవితం మీద విసుగెత్తి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించవు. చివరకు ఓ రోజు రోడ్డుపై నడుస్తుండగా ప్రమాదానికి గురవుతాడు. డాక్టర్లు చనిపోయాడని భావించి మార్చురీలో ఉంచుతారు. అయితే ఆశ్చర్యకరంగా అక్కడి నుంచే బతికివస్తాడు హీరో!

తర్వాత అతనికి కనిపించే నాలుగు దెయ్యాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ దెయ్యాలు తమ కోరికలు తీరాలని హీరోను వెంటాడుతుంటాయి. మొదట అయోమయానికి గురైన హీరో చివరికి వాటి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తూ, ఉత్కంఠతో ఉంచుతాయి.

హర్సిమ్రన్, మ్యాండీ థాకర్, కరంజిత్ అన్మోల్ ప్రధాన పాత్రల్లో నటించగా, నిషా బానో, సుఖ్విందర్ చాహల్, మల్కీత్ రౌనీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు హర్జోత్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహంబీర్ బాల్ నిర్మాణం చేశారు. సినిమాకి కామెడీ, హారర్, భావోద్వేగాల మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సినిమా కథ చూస్తే “రాక్షసుడు” వంటి థ్రిల్లర్ సినిమాలు గుర్తుకువస్తాయి. కానీ ఇందులోని హారర్, కామెడీ నాలుగు దెయ్యాల కోరికలు సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది. అదే ఈ చిత్రానికి యూనిక్ పాయింట్‌గా మారింది.

మొత్తంగా, భయం, నవ్వు, ఉత్కంఠ అన్నీ కలిపిన వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు మిస్టర్ షుడాయి మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం చౌపల్ ఓటీటీలో పంజాబీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు