/rtv/media/media_files/2025/09/11/monica-full-video-song-2025-09-11-19-53-57.jpg)
Monica Full Video Song
Monica Full Video Song: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "కూలీ" ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, రజనీ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని మాస్ ఫీస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే లిరికల్ వీడియో రూపంలో వచ్చిన పాట "మోనికా" కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ పాటలో పూజాహెగ్డే తన డాన్స్‌తో దుమ్ము రేపగా, నటుడు సౌబిన్ షాహిర్ కూడా స్పెషల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. మోనికా సాంగ్ తో కూలీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. మాస్ బీట్‌తో, స్టైలిష్ వీడియో ప్రెజెంటేషన్‌తో ఈ పాట ఇప్పుడు YouTubeలో ట్రెండింగ్‌లో ఉంది.
'కూలీ' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ మాస్ యాక్షన్ డ్రామాను చూడొచ్చు.
ఈ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున బోల్డ్ క్యారెక్టర్‌తో అదరగొట్టాడు. ఆయనతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకీ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉండడంతో, కథలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా విడుదల సమయానే, హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడింది. అయినా ‘కూలీ’ తనకంటూ ప్రత్యేకమైన మాస్ మార్కెట్‌ను నిలబెట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ నుంచి రిలీజ్ వరకు ప్రతి అప్‌డేట్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమా భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి రజనీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చిన సినిమా 'కూలీ'. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంలో ‘మోనికా’ పాట మాత్రం మరింత పాపులర్. మరి మీరు ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
Follow Us