Modi Biopic Maa Vande: మోదీ బయోపిక్ ‘మా వందే’కు బడ్జెట్ ఎంతో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తెరకెక్కుతున్న భారీ బయోపిక్ ‘మా వందే’ను ఎం. వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. రూ.400 కోట్లకుపైగా బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

New Update
Modi Biopic Maa Vande

Modi Biopic Maa Vande

Modi Biopic Maa Vande: భారత ప్రధాని నరేంద్ర  మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బయోపిక్ ‘మా వందే’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎం. వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. కథ వినగానే నచ్చి రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నారని సమాచారం.

‘మా వందే’ సినిమాను సుమారు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో చాలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే తొలిసారి ARRI Alexa 265 కెమెరాను Cooke లెన్స్‌లతో ఉపయోగించి చిత్రీకరణ చేస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాకు ఒక ప్రత్యేక ప్రయత్నంగా చెప్పొచ్చు.

ఈ చిత్రానికి సీ.హెచ్. క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  మోదీ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను ఆధారంగా తీసుకుని, ఆయన వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకు ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యంగా, “తల్లి ధైర్యం అన్ని కష్టాలకంటే గొప్పది” అనే భావనను ప్రధానంగా చూపించనున్నారు.

ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలు ఉండనున్నాయి. భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు జేసన్ మోమోవాను ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. స్టంట్ మాస్టర్ కింగ్ సోలమన్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కె.కే. సెంథిల్ కుమార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.

ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు ప్రీ-ప్రొడక్షన్ పనులు చేశారంటే దీని స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి కాగా, జనవరి 22 నుంచి కాశ్మీర్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

‘మా వందే’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో, అలాగే ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భావోద్వేగంతో పాటు  మోదీ జీవిత ప్రయాణాన్ని బలంగా చూపించే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు