కాకినాడ జిల్లా ఆర్టీసీ బస్ డ్రైవర్ డాన్స్ వీడియో ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ దేవర సినిమాలోని 'దావుదీ' పాటకు ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు వేసిన స్టెప్పులు సోషల్ మీడియా వైరలయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో బస్సు ఆగినపుడు సరదాగా డాన్స్ వేసినందుకు.. డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. పలువురు నెటిజన్లు ''డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించారంటూ''.. మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
డ్రైవర్ కు అండగా నారా లోకేష్
ఈ ట్వీట్స్ కు రియాక్టైన మంత్రి నారా లోకేష్ డ్రైవర్ కు భరోసాగా నిలిచారు. లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తనను కలుస్తానని ట్వీట్ చేశారు.
అయితే కాకినాడ జిల్లా తునిలోని రౌతులపుడి దగ్గర్లో ఆర్టీసీ బస్సులో సమస్య తలెత్తింది. దీంతో అది రోడ్డుపైనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా మళ్లీ స్టార్ట్ కాలేదు. అయితే ఆ బస్సు డ్రైవర్ అయిన లోవరాజు కిందకి దిగాడు. బస్సు ముందుకు వచ్చి దావుదీ పాటకు డ్యాన్స్ చేశాడు. దీంతో డ్రైవర్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ను ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరలయ్యింది. పలువురు నెటీజన్లు ప్రశంసిస్తూ విభిన్న రీతిలో కామెంట్స్ చేశారు. ఆఖరికి మంత్రి లోకేశ్ కూడా లోవరాజు డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఎక్స్ వేదికగా ఆ డ్రైవర్‌ను అభినందించారు.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి