/rtv/media/media_files/2025/11/07/michael-jackson-biopic-2025-11-07-15-31-39.jpg)
Michael Jackson Biopic
Michael Jackson Biopic: ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్ అంటే ఇష్టపడే అభిమానులు అనేకమంది ఉన్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం, పాప్ మ్యూజిక్‌కి ఒకే ఒక్క పేరు ప్రాణం పోశింది... అదే మైకేల్ జాక్సన్.
చిన్న వయసులోనే అతను తన పాటలు, నృత్యం ద్వారా ప్రపంచాన్ని కుదిపేశాడు. అతని పేరు విన్నా, పాట విన్నా, ప్రపంచం మొత్తం ఉత్సాహంలో మునిగిపోయేది.
మైకేల్ జాక్సన్ గాయకుడు మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్, సంగీతకారుడు కూడా. అతను వినోదానికి కొత్త రూపం ఇచ్చాడు. అతని స్టైల్, మూన్‌వాక్ డ్యాన్స్, పాటలలోని మ్యాజిక్ కోట్లాది మందిని ప్రేరేపిస్తుంది. అయితే, 2009లో 51 ఏళ్ల వయసులో మైకేల్ అకస్మాత్తుగా మరణించడం అభిమానులందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ వార్త ప్రపంచాన్ని కుదిపేసింది.
అతని మరణం తరువాత విడుదలైన “దిస్ ఇజ్ ఇట్” డాక్యుమెంటరీకి భారీ స్పందన వచ్చింది. మైకేల్ జాక్సన్ జీవితం ఎంత ప్రభావవంతమైందో, ఆ చిత్రం మళ్లీ అందరికీ గుర్తు చేసింది. ఇప్పుడు, అతని అద్భుతమైన జీవితాన్ని పెద్ద తెరపై చూపించబోతున్నారు. “మైకేల్” అనే బయోపిక్ రూపంలో అతని కథ ప్రపంచానికి మరోసారి చేరబోతోంది.
ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ విడుదల కాగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైకేల్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి హావభావాలు, నడక, డ్యాన్స్ మువ్స్ అన్ని మైకేల్‌లా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాయి.
ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు మైకేల్‌ను మళ్లీ తెరపై చూడబోతున్నామనే ఉత్సాహంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఈ సినిమా భావోద్వేగంతో పాటు నస్టాల్జియా అనుభూతిని కూడా ఇస్తుందని చెబుతున్నారు.
భారతదేశంలో కూడా మైకేల్ జాక్సన్‌కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అందుకే ఈ సినిమా భారత్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది.
మైకేల్ జాక్సన్ పేరు ఎప్పటికీ మరిచిపోలేనిది. అతని పాటలు, నృత్యం ఇవన్నీ ఇప్పటికీ సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బయోపిక్ ద్వారా మళ్లీ ఆ మంత్రం తెరపై కనిపించబోతోంది. పాప్ లెజెండ్ జీవితాన్ని మరోసారి అనుభవించడానికి ప్రపంచ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Follow Us