Varun Tej - Lavanya Tripathi: మరో మెగా వారసుడు వచ్చేసాడు.. వరుణ్ తేజ్ కి కొడుకు..

మెగా హీరో వరుణ్ తేజ్ శుభవార్త చెప్పాడు. బుధవారం(సెప్టెంబర్ 10) ఉదయం, ఆయన భార్య లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

New Update
Varun Tej - Lavanya Tripati

Varun Tej - Lavanya Tripati

Varun Tej - Lavanya Tripathi:

మెగా హీరో వరుణ్ తేజ్ శుభవార్త చెప్పాడు. బుధవారం(సెప్టెంబర్ 10) ఉదయం, ఆయన భార్య లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారి, మెగా కుటుంబంలోని కొత్త తరం లో తొలి అబ్బాయి కావడం మరింత ప్రత్యేకత కానుంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి.

దాదాపు రెండేళ్ల వివాహ జీవితం తర్వాత, వరుణ్, లావణ్య తల్లిదండ్రులుగా మారారు, త్వరలోనే ఈ శుభవార్తను అధికారికంగా పంచుకోనున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే, తను ఉన్న సెట్స్‌ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్య దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు