Meenakshi Chowdhury: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కెరీర్ లో చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఆమె సినిమాల్లోకి తొలి ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఆ తర్వాత అడివి శేష్‌తో కలిసి చేసిన హిట్ 2 చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈ విజయం ఆమెకు పరిశ్రమలో గుర్తింపును తెచ్చి, మరిన్ని అవకాశాలను అందించింది.
తరువాత ఆమె గుంటూరు కారంలో మహేష్ బాబు, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో నటిస్తూ, వరుస విజయాలను సొంతం చేసుకుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు. “నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తాను, కానీ భవిష్యత్తులో పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు చేయను. లక్కీ భాస్కర్లో కథ నచ్చడం వల్లే ఆ పాత్ర చేశాను, కానీ ఇలాంటివి మరల వస్తే మొహమాటం లేకుండా ‘నో’ చెబుతాను.” అని అన్నారు.
సీనియర్ హీరోలతో పనిచేయడంలో ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదని, అలా చేసే అవకాశం వస్తే దాన్ని ఒక కొత్త అనుభవంగా తీసుకుంటానని ఆమె అన్నారు. “వెంకటేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చాలా ఆస్వాదించాను. చిరంజీవి గారితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో ఒక ప్రత్యేక చాప్టర్ అవుతుంది అని నమ్ముతున్నాను” అని కూడా వెల్లడించారు.
తనపై వచ్చే రూమర్స్‌పై ఆమె స్పష్టత ఇచ్చారు. “నా గురించి ఏదైనా చెప్పాలంటే, నేనే చెబుతాను. నేను సోషల్ మీడియాలో ఉండటం వల్ల, ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు,” అని మీనాక్షి తెలిపారు.
మీనాక్షి చౌదరి తన కెరీర్ విషయంలో బలమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఏకకాలంలో పలు ప్రాజెక్ట్ అవకాశాలను అందుకుంటూ. కొత్త రోల్స్‌లో ప్రయత్నించి, సీనియర్ హీరోలతో పనిచేయడం ద్వారా ఆమె భవిష్యత్తు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటుందని స్పష్టంగా తెలిపారు.
Meenakshi Chowdhury: ఇకపై అలాంటి పాత్రలు చేయను: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి 'హిట్ 2'తో గుర్తింపు పొందిన తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.అయితే భవిష్యత్తులో పిల్లల తల్లి పాత్రలు చేయనని స్పష్టత ఇచ్చింది, సీనియర్ హీరోలతో పనిచేయడంలో ఇబ్బంది లేదని, రూమర్స్‌కి తాను సమాధానం ఇస్తానని చెప్పింది.
Meenakshi Chowdhury