Maruva Tarama: ‘మరువ తరమా’ మనసుకు హత్తుకునే ట్రైలర్‌ భయ్యా..! మీరూ చూసేయండి..

‘మరువ తరమా’ ట్రైలర్‌ను చూసి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో ఎమోషనల్‌గా ఉందని మెచ్చుకున్నారు. చైతన్య వర్మ నడింపల్లి రూపొందించిన ఈ ప్రేమకథలో హరీష్ ధనుంజయ, అథుల్య చంద్ర, అవంతిక హరి నల్వా నటించారు. నవంబర్ 28న విడుదల కానుంది.

New Update
Maruva Tarama

Maruva Tarama

Maruva Tarama: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్, ఇప్పుడు కొత్తగా విడుదలైన ‘మరువ తరమా’ ట్రైలర్‌పై స్పందించారు. ఈ ట్రైలర్ చూసి తనకు చాలా ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్లో తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు.

Maruva Tarama Trailer: 

‘మరువ తరమా’ ట్రైలర్‌ను చూసిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran), ఇది  హృదయాన్ని హత్తుకునేలా ఉందని అన్నారు. "ట్రైలర్‌లో మ్యూజిక్ చాలా లవ్‌లీగా ఉంది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాపై నా ఆసక్తి ఇంకా పెరిగింది” అని ఆయన తెలిపారు. దర్శకుడిగా మొదటి సినిమా చేస్తున్న చైతన్య వర్మ నడింపల్లికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరారు.

చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హరీష్ ధనుంజయ, అథుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కీలక పాత్రల్లో నటించారు. ఈ కథ ప్రేమ, ఎమోషన్స్, సంగీతం అన్నింటిని అందంగా కలిపి చూపించే ఒక కవితాత్మక ప్రేమప్రయాణం లా కనిపిస్తోంది.

సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్, విజువల్స్ ట్రైలర్ హైలైట్లుగా కనిపిస్తున్నాయి.

"ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ప్రేమ కథ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలీదు.." అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతోంది. “లవ్ అనేది ఒక మ్యాజికల్ ఫీలింగ్.. కారణాలు చెప్పలేం.” “ప్రేమ రెండు అక్షరాల చిన్న మాట. పలకడానికి సులువుగానే ఉంటుంది. కానీ దాన్తో పడాలంటేనే చాలా కష్టం.” ఇలాంటి డైలోగ్స్  ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

సినిమా మొత్తం ఒక మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమలోని తీపి, నొప్పి, భావోద్వేగాలు అన్నీ అద్భుతంగా చూపించారు. విజయ్ బుల్గానిన్, అరిష్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి హిట్ అయింది. రుద్ర సాయి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను కవిత్వంలా తీర్చిదిద్దింది. కేఎస్‌ఆర్ ఎడిటింగ్ కథానాయకుల ప్రయాణానికి సరైన పేస్ అందించింది. 

‘కోలీవుడ్’ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కూడా ఈ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రశంసలు కురిపించారు. ఆయన మాటలు సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాయి. అదే విధంగా దర్శకుడు అజయ్ భూపతి కూడా ట్రైలర్‌ను మెచ్చుకున్నారు.

నవంబర్ 28న థియేటర్లలోకి..

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, సాంగ్స్, చిన్న చిన్న వీడియోలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవంబర్ 28న ‘మరువ తరమా’ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక అందమైన అనుభూతి అవుతుందని ట్రైలర్ చెబుతోంది.

Advertisment
తాజా కథనాలు