/rtv/media/media_files/1Pvl129FaxWM6x269hRM.jpg)
Maruthi Nagar Subramanyam
Maruthi Nagar Subramanyam: టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రూపొందింది. ఆగస్టు 23న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓ యువత నిరుద్యోగ కష్టాల చుట్టూ తిరిగే ఈ కథ చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఓటీటీ రిలీజ్
థియేటర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.
We got the laughter therapy you need!
— ahavideoin (@ahavideoIN) September 13, 2024
The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh