/rtv/media/media_files/2025/10/23/prabhas-birthday-2025-10-23-09-43-35.jpg)
Prabhas Birthday
Prabhas Birthday: నేడు అగ్రకథానాయకుడు ప్రభాస్ పుట్టినరోజు దింతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సంబరాల వాతావరణం నెలకొంది. తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు దేశమంతటా ఉన్న ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 23 ప్రభాస్ అభిమానులకు ఒక పండుగలా మారిపోతుంది. ఈసారి కూడా సోషల్ మీడియా అంతా #HappyBirthdayPrabhas హ్యాష్‌ట్యాగ్‌తో నిండిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ 46వ ఏట అడుగుపెట్టారు. “బాహుబలి” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, “సలార్”, “కల్కి 2898 AD” వంటి పాన్ ఇండియా సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలతో ప్రభాస్ అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆయనకు ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కి హ్యాపీ బర్త్‌డే చెబుతున్నారు.
Happy Birthday to my brother #Prabhas 🔥
— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2025
You’ve always carried strength and grace, and my loyalty to you is for life.
Wishing you more power, peace & thunder at the box office 💥 Love you ❤️ Har Har Mahadev #HappyBirthdayPrabhas
Manchu Vishnu Birthday Wishes to Prabhas
ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతడి స్నేహితుడు, హీరో మంచు విష్ణు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని గుర్తుచేస్తూ,
"నా సోదరుడు #ప్రభాస్ 🔥 కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
నువ్వు ఎప్పుడు బలంగా, ఇతరులపై దయతో ఉన్నావు, జీవితమంతా నీపై విధేయతతో ఉంటా..
బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను 💥 హర్ హర్ మహాదేవ్"...
అంటూ విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభాస్, విష్ణు చాలా ఏళ్లుగా మంచి స్నేహితులని, వారి ఫ్రెండ్‌షిప్ టాలీవుడ్‌లో అందరికీ తెలుసు.
Prabhas Birthday Updates
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలపై కూడా పెద్ద అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే “ది రాజాసాబ్”, “స్పిరిట్”, “సలార్ పార్ట్ 2”, “కల్కి 2898 AD పార్ట్ 2” వంటి భారీ సినిమాలు ప్రభాస్ లైన్‌అప్‌లో ఉన్నాయి. అందుకే ఈరోజు ఆయన బర్త్‌డే స్పెషల్‌గా మూవీ టీమ్స్ కొత్త పోస్టర్లు, అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
మొత్తం మీద, ప్రభాస్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఉత్సవంలా మారింది. అభిమానుల ప్రేమ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు, సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ కలిపి ప్రభాస్ బర్త్‌డేను ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా మార్చేశాయి.
Follow Us