Manchu Lakshmi: మంచు మనోజ్ - విష్ణు గొడవలపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో, , కుటుంభం గొడవల వల్ల ఆమె వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన ‘దక్ష’ మూవీ సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది.

New Update
Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi: సినీ పరిశ్రమలోకి మంచు ఫ్యామిలీ ఎంత చర్చనీయాంశమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ వార్తల్లో నిలిచే ఈ కుటుంబం, గత కొద్ది కాలంగా సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య వచ్చిన కలహాలు, ఫ్యామిలీలో జరిగిన కొన్ని వివాదాలు మళ్ళీ మామూలయ్యాయని అనిపిస్తున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో వీటి గురించి ఎంతో చర్చ జరిగింది.

తాజాగా నటిగా, నిర్మాతగా పేరుగాంచిన మంచు లక్ష్మి, ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబంలో ఎదురైన సవాళ్లు, అలాగే ఆమె తండ్రి మోహన్ బాబుతో కలిసి చేసిన కొత్త సినిమా గురించి మాట్లాడారు.

లక్ష్మి మాట్లాడుతూ, “మా ఇంట్లో ఎవరు విజయాన్ని సాధించినా, అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకరికి ఎదురైన విజయాన్ని అసూయ లేకుండా, నిజంగా ఆస్వాదించగలగాలి” అని అన్నారు.

తండ్రి మోహన్ బాబుతో కలిసి నటించిన 'దక్ష: ఏ డెడ్‌లీ కాన్‌స్పిరసీ' సినిమా సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ విజయాలపై ప్రశ్నకు స్పందిస్తూ, “మిరాయ్‌” వంటి విజయాన్ని నేను చాలా ఆనందిస్తున్నాను. ఇలాంటి ఫలితాలు ఇవ్వాలని నేనెప్పుడూ కోరుకుంటా. ఎందుకంటే ఈ రంగంలో ప్రతి అడుగూ చాలా కష్టాలతో నిండినది” అని పేర్కొన్నారు.

కుటుంబ విభేదాలపై స్పందిస్తూ..

అంతేగాక, ఇటీవలే వార్తల్లో నిలిచిన మంచు కుటుంబ గొడవల గురించి కూడా ఆమె స్పందించారు. “ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి. అవి వస్తే బాధపడేది ఒక్కరే కాదు, మొత్తం కుటుంభం” అని ఆమె పేర్కొన్నారు.

“ఇంతకు ముందు ఏది సరి? ఏది తప్పు? అనేది చాలా ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నేర్చుకున్న విషయం ఒక్కటే - కొన్ని సందర్భాల్లో మౌనం ముఖ్యం. శాంతిగా ఉండటం మంచిదే. మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఏదో ఓ పాఠం నేర్పుతుంది. ఆ అనుభవాలే మన మనస్తత్వాన్ని మారుస్తాయి” అని అన్నారు.

సెప్టెంబర్ 19న ‘దక్ష’

ఇక మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం ‘దక్ష: ఏ డెడ్‌లీ కాన్‌స్పిరసీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ నటులు సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, సిద్ధిక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్న మంచు లక్ష్మి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, కుటుంబంతో కలిసి చూసేలా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు