/rtv/media/media_files/2025/11/16/mahesh-babu-varanasi-2025-11-16-15-56-24.jpg)
Mahesh Babu Varanasi
Mahesh Babu Varanasi: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న సినిమా వారణాసి. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. కె.వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచీ కలిసి ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాలో సుమారు 30 నిమిషాల ఓ ప్రత్యేక ఎపిసోడ్ ఉందట. అందులో మహేష్ బాబు నటనా విశ్వరూపం ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుందని ఆయన చెప్పారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చూసాక కలిగే భక్తి, ఆశ్చర్యం ఎలా ఉంటుందో… అదే భావన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు కలుగుతుందన్నారు. ఇంకా ముఖ్యంగా, ఈ సన్నివేశాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే చూసి కూడా తనకు గూస్‌బంప్స్ వచ్చాయని చెప్పారు.
What an epic moment at the #GlobeTrotter launch!
— Wikki 👽 (@WROGN_18) November 15, 2025
Legendary writer Vijayendra Prasad Sir delivers a heartfelt speech on SSMB29's vision, ending with a resounding "Jai Shri Ram 🚩" that echoed through Ramoji Film City.
Faith, family, and cinema magic! 🙏🚩🕉️🔱#MaheshBabu… pic.twitter.com/WSO5nD64VD
సంగీత దర్శకుడు కీరవాణి కూడా మహేష్ బాబు నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మహేష్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తుందని చెప్పారు. కీరవాణి అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారని అన్నారు. అలాగే, ఈ చిత్రం 2027 సమ్మర్లో భారీగా విడుదలకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రాజమౌళి మరో ప్రయోగం: వారణాసితో తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ
ఈ ఈవెంట్‌లో రాజమౌళి మరో ముఖ్య విషయాన్ని వెల్లడించారు. వారణాసి కోసం పూర్తిగా కొత్త టెక్నాలజీని తెలుగు సినిమాలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. దీనికి పేరు ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ - IMAX.
సాధారణంగా సినిమాలు సాధారణ కెమెరాతో షూట్ చేసి తరువాత IMAXకు కన్వర్ట్ చేస్తారు. బాహుబలి, RRR కూడా ఇదే విధంగా చేశారన్నారు. కానీ వారణాసి మాత్రం మొత్తం స్క్రీన్ IMAX ఫార్మాట్‌లోనే షూట్ చేయబోతున్నారట. అంటే, సినిమా ప్రేక్షకులకు పూర్తిస్థాయి పెద్ద స్క్రీన్ అనుభూతి ఇవ్వబోతోంది.
రాజమౌళి మాట్లాడుతూ, మహేష్ బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ కొత్త టెక్నాలజీలను సినిమాల్లోకి తీసుకువచ్చారని, ఇప్పుడు అదే రీతిలో మహేష్ కూడా కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారని అన్నారు.
వారణాసి 2027 సమ్మర్‌లో విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. మహేష్ బాబు విశ్వరూపం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ఇప్పటినుంచే మొదలైంది.
Follow Us