/rtv/media/media_files/2025/10/30/baahubali-the-epic-2025-10-30-10-01-51.jpg)
Baahubali The Epic
Baahubali The Epic: భారతీయ సినిమాలలో కొత్త చరిత్ర సృష్టించిన “బాహుబలి” ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి సినిమాకు పేరు “బాహుబలి: ది ఎపిక్”. 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ అయ్యే ఈ చిత్రం సాధారణ రీ-రిలీజ్ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. కొత్త ఎడిటింగ్, అద్భుతమైన విజువల్స్, క్లియర్ సౌండ్ డిజైన్‌తో “ఎక్స్‌పీరియన్స్ ది ఎపిక్” అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూవీ లవర్స్, ఫ్యాన్స్ ఈ రీమాస్టర్ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము దులిపేసారు . విదేశాల్లో ఒక రోజు ముందే విడుదలై, ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్‌బస్టర్ రివ్యూస్ అందుకుంది.
ప్రీమియర్ షో ఫ్యాన్స్ రియాక్షన్ Gautham Ghattamaneni at Baahubali The Epic
ప్రీమియర్ షోస్ లో మహేష్ బాబు కొడుకు కూడా థియేటర్‌కి వచ్చి సినిమా గురించి తన ఫీల్ పంచుకున్నారు. ప్రతి సీన్ గూస్ బంప్స్ ఇచ్చిందని, రాజమౌళి ఎడిటింగ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే, బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఇప్పుడు రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని, సరదాగా చెప్పుకొచ్చారు. తన తండ్రి మహేష్ బాబు రజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB 29 గురించి అడిగితే, “ఏమీ చెప్పను” అని అన్నారు.
Mahesh Babu Son (Gautham G) Shares His Baahubali The Epic Experience 🔥👌✨ pic.twitter.com/9LZ32JNsb2
— PAVANᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ 🚩 (@SREERAM_9999) October 30, 2025
రాజమౌళి తన స్టైల్ లో ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా, సీన్-బై-సీన్ అద్భుతంగా తెరకెక్కించారు. మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడు మధ్య యుద్ధం, అనుష్క ఎంట్రీ, ఇంటర్వెల్ వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులలో ఉత్సాహం రేపుతుంది. సెకండ్ హాఫ్‌లో డ్రామా, యాక్షన్, భావోద్వేగాలను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేస్తూ, క్లైమాక్స్‌కు చేరుకునే మోమెంట్స్ ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేసాయి. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది.
సర్‌ప్రైజ్: ది ఎటర్నల్ వార్
సినిమా చివరలో “బాహుబలి: ది ఎటర్నల్ వార్” అనే యానిమేటెడ్ ఫిల్మ్ టీజర్ చూపించారు. ఈ కొత్త 3D సినిమా, బాహుబలి ప్రపంచాన్ని కొత్త కోణంలో కొనసాగిస్తుంది. భారీ బడ్జెట్‌తో (₹120 కోట్ల) రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ ను ఇషాన్ శుక్లా అనే టాలెంటెడ్ 3d యానిమేటర్ రెండేళ్లు కష్టపడి రూపొందించారు.
“బాహుబలి: ది ఎపిక్” రీమాస్టర్, థియేటర్‌లో తప్పక చూడాల్సిన మహా అనుభూతి. ప్రభాస్ నటన, రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం కలిసిన ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.
Follow Us