/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-one-2025-08-29-15-00-14.png)
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే రమేష్ బాబు కూతురు భారతి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-two-2025-08-29-15-00-14.png)
టాలీవుడ్ కి ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ భారతిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారట.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-three-2025-08-29-15-00-14.png)
భారతి సినీ రంగ ప్రవేశానికి మహేష్ బాబు , కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ ఉందంట. ఇప్పటికే భారతి తన పాత్రకు సంబంధించిన లుక్ టెస్టులు, వర్క్ షాపులు కూడా పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-four-2025-08-29-15-00-14.png)
దర్శకుడు తేజ తన సినిమాలో హీరోయిన్ పాత్రకు సాంప్రదాయమైన, ఆకర్షణీయమైన రూపం ఉన్న అమ్మాయి కోసం వెతుకుంతుండగా.. భారతీ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించారట. అందుకే భారతిని హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-five-2025-08-29-15-00-14.png)
భారతి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. గతేడాది మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటను రీక్రియెట్ చేస్తూ రీల్ చేయగా ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, ఎనర్జీ చూసే తేజ సినిమాలో అవకాశం లభించిందని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-six-2025-08-29-15-00-14.png)
ఇదిలా ఉంటే.. గతంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినీ రంగ ప్రవేశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంజుల సినిమాల్లో నటించడాన్ని కృష్ణ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-seven-2025-08-29-15-00-14.png)
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-eight-2025-08-29-15-00-14.png)
అలాగే ఘట్టమనేని కుటుంబం నుంచి అన్నాచెల్లుళ్ళు ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో సినిమాల్లోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
/rtv/media/media_files/2025/08/29/bharathi-g-pic-one-2025-08-29-15-00-14.png)
జయ కృష్ణ 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.