/rtv/media/media_files/2025/09/22/karthi-kaithi-2-2025-09-22-20-02-40.jpg)
Karthi Kaithi 2
Karthi Kaithi 2: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో 2019లో విడుదలైన ‘ఖైదీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కథనం కొత్తగా ఉండటం, రాత్రంతా నడిచే యాక్షన్, హీరో కార్తీ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అన్ని కలిసి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమాతో కార్తీకి మంచి ఫాలోయింగ్ పెరిగింది.
ఈ మూవీలో చాలా కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, కథను మిస్టరీగా ముగించిన దర్శకుడు లోకేష్, ‘ఖైదీ 2’లో ఆ సీక్రెట్లన్నింటిని రివీల్ చేయనున్నాడు. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఖైదీ 2’ తాత్కాలికంగా నిలిపివేసినట్లు టాక్. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం లోకేష్ కనగరాజ్, కార్తీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెబుతున్నారు.
Exclusive ✴️
— Milagro Movies (@MilagroMovies) September 22, 2025
Sad news for #Khaidi2 fans, the movie has been put on hold due to creative issues. Let's hope the team resolves things soon! #Karthi#LokeshKanakarajpic.twitter.com/96TDWVlDgB
రజినీకాంత్-కమల్ మల్టీస్టారర్..
ఇప్పటివరకు కార్తీ చాలా కాలంగా ఖైదీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ లోకేష్ ఇప్పటికే లియో, కూలీ, రజినీకాంత్-కమల్ మల్టీస్టారర్, ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండిపోయాడు. చివరకు ఖైదీ 2 పై దృష్టి పెట్టే సమయం వచ్చేసరికి, ఇద్దరి మధ్య కథపై కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తినట్టు సమాచారం.
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ సినిమాకి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది అభిమానులు ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోయిందని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్‌పై సోషల్ మీడియాలో ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఖైదీ 2 కూడా ఆగిపోవడం, ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
ఇప్పటికైనా లోకేష్ కనగరాజ్ లేదా కార్తీ ఈ వార్తలపై స్పందిస్తారా? ఖైదీ 2 తిరిగి ట్రాక్‌లోకి వస్తుందా? లేక నిజంగానే క్యాన్సిల్ అయిందా? అన్నది వేచి చూడాలి.