Lokesh Kanagaraj DC Glimpse: దేవదాస్ గా లోకేష్ కనగరాజ్.. ‘DC’ గ్లింప్స్ మాస్ విధ్వంసం!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ‘DC’ సినిమా స్పెషల్ గ్లింప్స్ విడుదలై ఆసక్తి రేపింది. ఈ మూవీ పాత తరహా ప్రేమకథ దేవదాస్ ను కొత్త కోణంలో, భారీ యాక్షన్, ఎమోషన్లతో చూపించనుంది. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

New Update
Lokesh Kanagaraj DC Glimpse

Lokesh Kanagaraj DC Glimpse

Lokesh Kanagaraj DC Glimpse

Lokesh Kanagaraj DC Glimpse:దిమ్మతిరిగే యాక్షన్, రోమాన్స్, డ్రామా కలిపిన పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఆయన తాజా చిత్రం ‘DC’ స్పెషల్ గ్లింప్స్ విదుదలైంది. ఈ సినిమా వేసవి సీజన్‌లో థియేటర్లకు రాబోతోంది.

గ్లింప్స్ లో, లోకేష్ ఎవరు ఊహించనట్లుగా యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. ఇది పాత తరహా ప్రేమకథ దేవదాస్ ను కొత్త కోణంలో చూపిస్తుందట, కొన్ని హింసాత్మక ట్విస్టులు కూడా ఉంటాయి.

గ్లింప్స్‌లో డైలాగ్స్ లేవు, కానీ హీరో ఎంట్రీతో పాటు వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తిని చూపించారు. లోకేష్ కనిపించిన సన్నివేశం భారీ యాక్షన్‌లోకి మారుతుంది. బ్లడ్ బాత్ వయోలెన్స్ తో ‘బ్లడీ వాలెంటైన్’ గ్లింప్స్ పేరుకు తగ్గట్టు గానే చాల భయంకరంగా ఉంది.

సినిమా దర్శకుడు అరుణ్ మతేశ్వరన్, ఇంతకుముందు రాకీ, సానీ కాయిదాం, క్యాప్టెన్ మిల్లర్ వంటి సినిమాలను రూపొందించాడు, గ్లింప్స్‌ను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. సంగీతం అనిరుధ్ అందించిన స్కోరు, ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది.

లోకేష్ ఒక స్టైలిష్డ్ యాక్షన్- వాయలెన్స్ దర్శకుడు గా పేరు ఉన్న దర్శకుడు. కానీ నటుడిగా పరిచయం అవుతూ చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది ప్రస్తుత కాలంలో ప్రదీప్ రంగనాథన్, అభిషేక్ జివంత్ లాంటి దర్శకులు నటనలో కూడా హిట్ అవుతున్న సందర్భంలో, లోకేష్ కూడా సత్తా చాటవచ్చు. అయినప్పటికీ, దర్శకుడిగా ఆయనకు ఉన్న అభిమానాన్ని కూడా కాపాడుకోవాలి.

ఇక ‘DC’ సినిమా, రోమాంటిక్ యాక్షన్- డ్రామా గా రూపొందుతుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సినిమా కోసం భారీ హైప్ ఉంది.

Advertisment
తాజా కథనాలు