/rtv/media/media_files/oTO8Yc2K7aaNQ9fzSvkf.jpg)
smart phone Addiction
/rtv/media/media_files/smartphone33-1.jpeg)
ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుల మారిపోయింది. పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరూ 24 గంటలు స్మార్ట్ ఫోన్స్ తోనే గడిపేస్తున్నారు. దీనిని సరైన పద్దతిలో వాడినంత వరకే ఇది ఉపయోగకరం.. లేదంటే ప్రాణాలకే ముప్పు కలిగించే అవకాశం ఉంది.
/rtv/media/media_files/smartphone44-1.jpeg)
ఇక కొంతమందిలో అయితే ఈ స్మార్ట్ ఫోన్ వాడకం ఒక వ్యసనంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అర్ద రాత్రిళ్ళ వరకు ఫోన్ చూస్తూనే ఉండిపోతున్నారు. ఒక్కసారి బానిసలయ్యమంటే ఇక దానికి దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. ఉండలేకపోయే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇలా స్మార్ట్ ఫోన్ వ్యసనంతో బాధపడుతున్న వారు ఈ 5 చిట్కాల ద్వారా బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/smartphone-00.jpeg)
డేటా ఆఫ్ చేయండి
డేటా ఎక్కువగా ఆన్ చేసి ఉంచడం వల్ల సోషల్ మీడియా అప్డేట్లు, నోటిఫికేషన్లు మీ దృష్టిని మరల్చడానికి దారితీస్తాయి. అంతేకాదు ఫోన్ నుంచే వచ్చే ఈ మెసేజెస్ పనిపై దృష్టి పెట్టడాన్ని కష్టతరం చేస్తాయి. కావున ఇంటర్నెట్ ను వీలైనంత తక్కువగా ఆన్ చేయండి.
/rtv/media/media_files/smartphone55-1.jpeg)
బిజీగా ఉండడం
మీ మనసు మొబైల్ వైపు వెళ్తున్నట్లయితే.. ఏదో ఒక పనిలో నిమగ్నం అవడానికి ప్రయత్నించండి. పుస్తకం చదవడం, మ్యూజిక్ వినడం, ఇంటి పనులు చేయడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా వ్యసనానికి దూరమవుతారు.
/rtv/media/media_files/smartphone66-1.jpeg)
నిద్ర లేవగానే మొబైల్ చూడడం
చాలా మంది బెడ్ పై నుంచి లేవగానే మొబైల్ చేతిలో పట్టుకుంటారు. ముందుగా ఇలా చేయడం ఆపేయండి. దీనికి బదులుగా ఉదయాన్నే వ్యాయామం లేదా యోగా చేయండి. ఇలా రోజు చేయడం ద్వారా క్రమంగా ఫోన్ చూసే అలవాటు తగ్గిపోతుంది. అంతే కాదు నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల రోజంతా డిస్టర్బ్ గా ఉంటుంది.
/rtv/media/media_files/smartphone77-1.jpeg)
నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి
మొబైల్ వ్యసనాన్ని నివారించడానికి ముందుగా చేయాల్సిన పని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండం. నోటిఫికేషన్స్ పదే పదే రావడం వల్ల ఫోన్ చూడాలనే ఆశ కలుగుతుంది. అందుకని వీటిని ఆఫ్ చేయడం వల్ల ఫోన్ తక్కువగా చూసే అవకాశం ఉంటుంది.