ఋతుస్రావం అనేది స్త్రీలలో ఒక సహజమైన ప్రక్రియ. ఆడపిల్లలు 11-13 సంవత్సరాల వయసులో ఈ రుతుక్రమం ప్రారంభమవుతుంది. ఇక నేటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాల వల్ల కొంతమంది అమ్మాయిల్లో 10 సంవత్సరాలకే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. స్త్రీలలో ఈ ప్రక్రియ 50 సంవత్సరాల వయస్సు కొనసాగుతూనే ఉంటుంది.
అయితే ఒక మహిళా కోమాలో ఉన్నప్పుడు ఆమెకు రుతుస్రావం అవుతుందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కోమాలో ఉన్నప్పుడు పీరియడ్స్ పూర్తిగా వస్తాయా లేదా ఆగిపోతాయా? దీని పై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కోమాలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయా?
ఒక మహిళకు ఏదైనా ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళినప్పుడు.. తన పునరుత్పత్తి వ్యవస్థకు ఎటువంటి గాయం లేకుండా ఆరోగ్యంగా ఉంటే పీరియడ్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కోమాలో ఉన్నప్పటికీ శరీరం యదావిధిగా తన విధులను కొనసాగుతుంది.
ఒకవేళ మహిళలలో పోషకాహార లోపం, PCOS వంటి సమస్యలు ఉంటే పీరియడ్స్ కాస్త ఆలస్యంగా లేదా తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ అనేది మహిళల్లో ఒక సహజ ప్రక్రియ.. కోమాలోకి వెళ్లినా అది కొనసాగుతూనే ఉంటుంది. పునరుత్పత్తి వ్యవస్థకు ఏదైనా సమస్య, గాయమైన పరిస్థితిలో మాత్రమే పీరియడ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది.
కోమా అంటే ఏంటి?
కోమా అనేది సుదీర్ఘమైన అపస్మారక స్థితి. ఈ పరిస్థితిలో వ్యక్తి ప్రతిస్పందించలేకపోవడం, శారీరక స్పందన లేకపోవడం జరుగుతుంది. తలకు తీవ్రమైన గాయం, కాలేయం, అల్పపీడనం, కరెంట్ షాక్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, గుండె వైఫల్యం, మధుమేహం, వంటి అనేక కారణాలు కోమాలోకి వెళ్లడానికి కారణం కావచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.