Yuganiki Okkadu Re Release: 'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలో కార్తీ సందడి..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన "యుగానికి ఒక్కడు" సినిమా తిరిగి థియేటర్లలో సందడి చేయనుంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ మూవీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 14న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

New Update
Yuganiki Okkadu Re Release

Yuganiki Okkadu Re Release

Yuganiki Okkadu Re Release: ప్రెజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది. అభిమానులు తమ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలు తిరిగి థియేటర్లలో చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  అప్పట్లో ప్లాప్ అయినా ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ టైం లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే, విక్టరీ వెంకటేష్ , మహేష్ బాబు, అంజలి , సమంత నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీ  కూడా ఇటీవల థియేటర్లలో విడుదలై, ఫాన్స్ ను  విపరీతంగా ఆకట్టుకుంది. 

అయితే అదే బాటలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన "యుగానికి ఒక్కడు" సినిమా తిరిగి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే  భారీ విజయం సాధించింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విజువల్  వండర్ గా కార్తీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది,ఈ మూవీలో ఆండ్రియా, రీమాసేన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈనెల 14న థియేటర్లలో

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ మూవీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 14న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో కూడా ఈ మూవీ రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా
ఇప్పటికే ఆహా ఓటీటీలో తెలుగు వర్షన్‌, అలాగే సన్‌నెక్ట్స్‌లో తమిళ వర్షన్‌  స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రీ రిలీజ్ లో మళ్ళీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు