Kantara OTT: కాంతారా చాప్టర్ 1: OTT రిలీజ్‌.. ప్రొడ్యూసర్ షాకింగ్ డెసిషన్..!

'కాంతారా చాప్టర్ 1' OTTలో విడుదల అవ్వనుంది. రిషబ్ షెట్టి హీరో, దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో హిట్ అయ్యి ₹816 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా సౌత్ వెర్షన్స్ నేడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

New Update
Kantara Chapter 1

Kantara OTT

Kantara OTT: ఈ సంవత్సరం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో హిట్టైన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతారా చాప్టర్ 1' రేపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ అవుతోంది. రిషబ్ షెట్టి దర్శకుడు, హీరోగా నటించిన ఈ సినిమా, రిలీజ్ అయినప్పటి నుంచి థియేటర్స్‌లో భారీ కలక్షన్లు సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సాధారణంగా ఏ సినిమాకైనా విడుదలైన కొన్ని నెలల తర్వాతనే OTT విండో కల్పిస్తారు. కానీ కాంతారా కోసం సినిమా రిలీజ్ అయిన కేవలం నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ నిర్ణయం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. బాక్స్ ఆఫీస్‌లో సినిమా ఇంకా సూపర్ హిట్ గా ఆడుతుండంగానే, OTTకు ఎందుకు తీసుకువచ్చారో ప్రేక్షకుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాంతారా చాప్టర్ 1 కో-ప్రొడ్యూసర్, ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందంలో భాగమని తెలిపారు. అప్పటి ఇండస్ట్రీ విడుదల విధానాల ప్రకారం, మొదట సౌత్ ఇండియా వెర్షన్లు మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో వస్తాయని అన్నారు.

ఈ ముందస్తు డిజిటల్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ కలక్షన్లపై పెద్ద ప్రభావం చూపించదు. మొత్తం కలక్షన్లలో సుమారు 10–15% తేడా మాత్రమే ఏర్పడుతుందని చెప్పాడు. అంటే, సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే ₹816 కోట్లు పైగా కలెక్ట్ చేసి, 2025 లో ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా అయ్యింది. సినిమాలో రుక్మిణి వాసంత్, జయరామ్, గుల్షన్ దేవాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. B. అజనీస్ లోక్నాత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబేల్ ఫిల్మ్స్ నిర్మించింది.

Advertisment
తాజా కథనాలు