/rtv/media/media_files/2024/12/02/oyhbVGOu3tY6yl5z6WJ7.jpg)
Kanha
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్ లోని ఓ హోటల్ ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ నిర్వహించగా.. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ పై రైడ్ చేశారు. ఈ పార్టీలో నిర్వాహకుడు గంగాధర్ తో పాటు పార్టీలో పాల్గొన్న ఢీ కొరియోగ్రాఫర్ కన్హా మొహంతి, ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి, సఖి, గంగాధర్ పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.4.18 లక్షల విలువైన MDMA, ఎల్ఎస్, చరాస్ డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు సమాచారం ప్రకారం.. ఏపీలోని విజయనగరానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి మద్దెలపాలెంలో ఉంటూ స్టాక్ మార్కెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కన్హ మొహంతి, అర్కిటెక్చర్ ప్రియాంకా రెడ్డి, సఖి ఫ్రెండ్స్ అయ్యారు. కాగా, గంగాధర్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్ తెప్పించడం చేస్తుండేవాడు.
కన్హా తో పాటు నలుగురు
ఇందులో భాగంగానే డ్రగ్స్ పార్టీ నిర్వహించేందుకు ప్లాన్ చేశాడు. గంగాధర్ కొరియోగ్రాఫర్ కన్హాతో కలిసి బెంగళూర్ నుంచి ఎండీఎంఏ డ్రగ్, గంజాయి, ఇతర డ్రగ్స్ తీసుకొచ్చి.. గచ్చిబౌలిలోని ఓ హోటల్ రూమ్ లో పార్టీ చేసుకుంటుండగా.. పోలీసులకు పట్టుబడ్డారు. ఆ గదిలో డ్రగ్స్ తో పాటు 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.