Kanchana 4k Re Release: 'కాంచన 4K' రీ-రిలీజ్ ట్రైలర్‌ వచ్చేసింది.. థియేటర్లలో రచ్చ రచ్చే..!

హోలీ సందర్భంగా ‘కాంచన 4K’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. శరత్ కుమార్ నటన, లారెన్స్ కామెడీ, థ్రిల్లింగ్ సీన్లు 4Kలో ఆకట్టుకుంటున్నాయి. రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఈ సినిమా మళ్లీ థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

New Update
Kanchana 4k Re Release

Kanchana 4k Re Release

Kanchana 4k Re Release Trailer

Kanchana 4k Re Release: హోలీ పండుగ సందర్భంగా ప్రేక్షకులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు కాంచన మూవీ టీమ్. ‘కాంచన 4K’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6:03 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. విడుదలైన కాసేపటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్‌లో శరత్ కుమార్ పవర్‌ఫుల్ నటన, లారెన్స్ కామెడీ టైమింగ్, థ్రిల్ కలిగించే సీన్స్ అన్నీ 4K క్వాలిటీలో మరింత క్లియర్‌గా కనిపిస్తున్నాయి. పెద్ద తెరపై ఈ విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల రీ-రిలీజ్ సినిమాలకు మంచి ట్రెండ్ ఉంది. ఈ నేపథ్యంలో ‘కాంచన’ మళ్లీ థియేటర్లలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ రీ-రిలీజ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు