Kalinga: ధృవ వాయు స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'కళింగ'. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ గా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నెల రోజులు తిరగక్కుండానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ‘అక్కడికి పోవడమే గానీ, రావడం ఉండదు’ అంటూ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ప్రకటించారు.
బిగ్ బిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా నయన్ కథానాయికగా నటించగా.. అడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, హరిశ్చంద్ర, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కళింగ స్టోరీ
ప్రేమ కథకు దైవిక అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా అంతా 'కళింగ' అనే గ్రామం.. అక్కడి వ్యక్తులు, పరిస్థుతుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ ఊరి పొలిమేర దాటి బయటకు వెళితే మళ్ళీ ప్రాణాలతో తిరిగిరారు అనేది ఊళ్లోని ప్రజల భయం.
ఈ ఊళ్ళో లింగ (ధృవవాయు) సారాకాస్తూ తనకు నచ్చినట్లుగా బతుకుతుంటాడు. ఇతను ఒక అనాథ. లింగ అదే ఊరికి చెందిన పద్దును (ప్రజ్ఞా నయన్) ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి మాత్రం వాళ్ళ ప్రేమకు అడ్డు చెబుతుంటాడు. ఇక చివరికి పద్దు తండ్రి లింగాకు ఒక కండీషన్ పెడతాడు.. ఊరి పెద్ద (ఆడుకాలం నరేన్) వద్ద తనఖాలో ఉన్న తన పొలాన్ని తిరిగి విడిపించుకుంటే పద్దును ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లిన లింగాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.? కళింగ రాజ్ సంపద అడవిలో ఎక్కడ ఉంది..? గత కొన్నేళ్లుగా ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏంటి..? అసలు ఊరి పెద్ద పద్దును, లింగాను ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నాడు..? ఊరు దాటి వెళ్లిన లింగా ఎలా వచ్చాడు..? అనేది ఈ సినిమా కథ.