Kaantha Review: దుల్కర్ సల్మాన్  'కాంతా' ట్విట్టర్ టాక్ ఇదే. హిట్టా..?

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించిన  'కాంతా' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. 1950 ల కాలం నాటి సినీ పరిశ్రమ నేపథ్యంలో ఒక మర్డర్ మిస్టరీ డ్రామాగా ఈ కథ సాగుతుంది.

New Update
Kaantha Trailer

Kaantha Trailer

Kaantha Review:  దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించిన  'కాంతా' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. 1950 ల కాలం నాటి సినీ పరిశ్రమ నేపథ్యంలో ఒక మర్డర్ మిస్టరీ డ్రామాగా ఈ కథ సాగుతుంది. ట్విట్టర్ లో ఈ సినిమాకు  మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు సినిమా సూపర్ అని చెబుతుండగా.. మరికొందరు పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. 

మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా  గురువు సముద్రఖని, శిష్యుడు మధ్య ఉండే ఈగో క్లాష్ సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటర్వెల్ ట్విస్టుతో ఫస్ట్ హాఫ్ క్యూరియస్ గా ముగుస్తుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ, దుల్కర్ సల్మాన్ పాత్ర ఎగ్ జైట్ చేస్తుందని అంటున్నారు. కొంత సమయం తర్వాత కథ థ్రిల్లింగ్ గా, ఇన్వెస్టిగేషన్ పద్దతిలో ఆసక్తిగా సాగుతుందని చెబుతున్నారు. 

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే  తన నటనతో ఆకట్టుకుందని, రానా దగ్గుబాటి ఇన్వెస్టిగేటర్ పాత్రలో అదరగొట్టారని అంటున్నారు. టెక్నికల్ అంశాలు పరంగా కూడా సినిమా చాలా బ్రిలియంట్ గా ఉందని చెబుతున్నారు.  బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. సినిమాలో ఆ వింటేజ్ ఫ్లేవర్ ను చక్కగా ప్రజెంట్ చేశారని చెబుతున్నారు.

 చాలామంది సినిమా చాలా బాగుందని, "మాస్టర్ పీస్" అని అంటున్నారు. అయితే, కొంతమందికి మాత్రం సెకండాఫ్‌ కాస్త బోరింగ్ గా ఉన్నా.. లాస్ట్ 30 నిమిషాలు ఆకట్టుకుంటుందని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు