/rtv/media/media_files/2025/03/25/YAqIgKKXiSNYuoESWyQk.jpg)
NTR Dance in Japan
NTR Dance in Japan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో వచ్చిన దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజైన ఈ మూవీ రూ.500 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Also Read:USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
అయితే ఇప్పుడు దేవర జపాన్ ఫ్యాన్స్ కోసం ఈ నెల 28న జపనీస్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ ప్రొమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లి అక్కడి అభిమానులతో కలిసి సందడి చేసారు.
Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
డాన్స్ కుమ్మేసాడుగా..!
అయితే, జపాన్‌లోని ఓ ఈవెంట్ లో అభిమానితో కలిసి ఎన్టీఆర్ ‘ఆయుధ పూజ’ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లారు. వీళ్లిద్దరి కాంబోలో త్వరలో రానున్న దేవర పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Also Read: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
NTR Anna Dance To Ayudha Pooja In Japan ❤️💥 pic.twitter.com/9W7mAQo8lm
— NTR NEEL💥 (@NTRNEEL9177) March 24, 2025