Jigris Movie: రెండు ఓటీటీలలో టాప్.. ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న ‘జిగ్రిస్’..!

కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ సినిమా 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో నం1‌గా ట్రెండ్ అవుతోంది. ప్రమోషన్స్ లేకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్ తో హిట్ అయ్యింది. క్లైమాక్స్ లో వచ్చే ఇంటర్వ్యూ సీన్ హైలైట్‌గా నిలిచి హీరో కృష్ణ కెరీర్‌లో కొత్త స్టార్‌గా మారింది.

New Update
Jigris Movie

Jigris Movie

Jigris Movie: ఎటువంటి భారీ ప్రచారం లేకుండా, కేవలం ప్రేక్షకుల నోటి మాటలతోనే ఒక సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో నంబర్ 1 స్థానానికి చేరడం నిజంగా అరుదైన విషయం. ఈ ఘనతను సాధించింది ‘జిగ్రిస్’ సినిమా. ఈ విజయానికి ప్రధాన కారణం నటుడు కృష్ణ బురుగుల(Actor Krishna Burugula) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన న్యాచురల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు, బంధువులకు ‘జిగ్రిస్’ను చూడమని చెబుతున్నారు. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాకే సినిమాను ముందుకు తీసుకెళ్లింది. ఇదే ఈ సినిమాకు అసలైన బలం అని చెప్పొచ్చు.

కృష్ణ బురుగుల నటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. న్యాచురల్ గా కనిపించే ఆయన స్టైల్, డైలాగ్ చెప్పే విధానం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. డబ్బింగ్‌లో ఆయన చూపిన వేరియేషన్ కు కూడా ప్రత్యేక ప్రశంసలు అందుతున్నాయి. సినిమా మొత్తం బాగున్నా, క్లైమాక్స్‌లో వచ్చే ఇంటర్వ్యూ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. 

‘జిగ్రిస్’ సినిమా కృష్ణ బురుగుల కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో ఒక కొత్త స్టార్ పుట్టాడని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో కృష్ణ నుంచి మరిన్ని మంచి పాత్రలు చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.