Dhana Pisaachi: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరో సుధీర్ బాబు 'జటాధర' తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సోనాక్షి సిన్హా నేపథ్యంలో రూపొందిన ‘ధన పిశాచి’ పాటను విడుదల చేశారు. ఇందులో సోనాక్షి లుక్ చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. తొలిసారి సోనాక్షి తెలుగులో నటిస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీహర్ష లిరిక్స్ అందించిన ఈ పాటను సాహితి చాగంటి పాడింది. సమీర కొప్పికర్ సంగీతం అందించారు.
Damn, SONAKSHI SINHA slays in #DhanaPisaachi song from #Jatadhara 🔥
— CineHub (@Its_CineHub) September 30, 2025
The MAKERS Zee Studios and Prerna Arora dropped the 1st Song on #DurgaPuja ! This one is FIERCE, BOLD and gives GOOSEBUMPS 🥶💥💥💥
In Cinemas from 7th Nov in Hindi & Telugu🎬✅@zeestudios_@zeestudiossouth… pic.twitter.com/IvAtzxBdWG
ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్ . ఇందులో భాగంగానే సినిమా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ మూవీ పై హైప్ పెంచుతున్నారు.
ఇందులో దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, ఝాన్సీ, సుబ్బలేక సుధాకర్, నవీన్ నేని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య శిల్పా శిరోద్కర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సోనాక్షితో పాటు శిల్పకు కూడా తెలుగులో ఇది మొదటి సినిమా. జీ స్టూడియోస్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్
ఇదొక సూపర్ ​నేచురల్ థ్రిల్లర్ పౌరాణిక ఫాంటసీ అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా. ఈ కథలో పురాణాలు, అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ ఉంటాయని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సోనాక్షి భయంకరమైన దుష్ట శక్తి 'ధన పిశాచి' పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, 'సోల్ ఆఫ్ జటాధార', 'ధన పిశాచి' పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాపై అంచనాలను కూడా భారీగా ఉన్నాయి. సుదీర్ బాబు కెరీర్ లోనే 'జటాధార ' ఒక చాలెంజింగ్ పాత్ర అని ఆయన ఓ ఇంటర్వూలో తెలిపారు. బాలీవుడ్ కాస్ట్ సోనాక్షి, శిల్పా వంటి వారు కూడా ఈ సినిమాలో ఉండడంతో హిందిలో కూడా దీనికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.