జానీ మాస్టర్‌కు మరో బిగ్‌ షాక్‌!

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు మరో బిగ్‌షాక్‌. జానీ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్‌ వేశారు. నేషనల్ అవార్డు రద్దు కావడంతో బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది.

New Update

Jani master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే నేషనల్ అవార్డు కోసం జానీ మాస్టర్ కు ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయగా.. తాజాగా  బెయిల్  రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు.  నేషనల్ అవార్డు రద్దు కావడంతో బెయిల్ మంజూరిని రద్దు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఓ వైపు నేషనల్ అవార్డు, మరోవైపు బెయిల్ రద్దు కావడంతో జానీ మాస్టర్ ఫ్యామిలీ, అతని అనుచరులలో ఆందోళన నెలకొంది. జానీకి తమిళ్ ఫిల్మ్ 'తిరుచిత్రంబలం' లో "మేఘం కారుక్కత" పాటకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వరించింది. 

కస్టడీలో జానీ మాస్టర్

ఇప్పటికే గత కొద్ది రోజులుగా కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ను విచారణలో భాగంగా పోలీసులు పలు విధాల ప్రశ్నలు అడిగారు. షూటింగ్ సమయంలో క్యారవ్యాన్ లో యువతిని  వేధించావా..? ఆమెను మతం మార్చుకోమని బెదిరించావా? ముంబై హోటల్ లో అర్థరాత్రి టైంలో యువతి రూమ్ కి వెళ్ళావా..?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ జానీ మాత్రం పోలీసులు అడిగే   ప్రశ్నలకు పొంతనలేని సమాదానాలు చెప్పినట్లు సమాచారం. 

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు 

అయితే జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్.. జానీ గత కొన్నాళ్లుగా తనను  లైంగికంగా వేధిస్తున్నాడని సెప్టెంబర్ 18న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ ఆమె పై వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో చట్టం కింద కూడా  కేసు పెట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు