/rtv/media/media_files/2025/12/17/rajamouli-varanasi-2025-12-17-15-01-53.jpg)
Rajamouli Varanasi
Rajamouli Varanasi: ప్రపంచ సినిమా స్థాయిలో మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ చిత్రంతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వారు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చగా మారింది.
ఇటీవల జేమ్స్ కామెరూన్ తన కొత్త సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ (అవతార్ 3) ప్రమోషన్స్‌లో భాగంగా ఎస్.ఎస్. రాజమౌళితో ప్రత్యేక వీడియో చాట్‌లో పాల్గొన్నారు. ఈ సంభాషణలో రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు నటించిన ‘వరణాసి’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajamouli James Cameron Interview
వారణాసి సెట్ లో జేమ్స్ కెమెరూన్#Varanasi#Rajamouli#JamesCameron
— DailySpark (@PantMania) December 17, 2025
pic.twitter.com/gohFVXzdbI
వీడియోలో జేమ్స్ కామెరూన్, “మీరు వరణాసి సినిమా షూటింగ్ చాలాకాలంగా చేస్తున్నారని విన్నాను. అది నిజమేనా?” అని అడిగారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ, “అవును సార్. దాదాపు ఏడాది నుంచి షూటింగ్ జరుగుతోంది. ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలలు షూటింగ్ మిగిలి ఉంది. ప్రస్తుతం షూటింగ్ మధ్య దశలో ఉన్నాం” అని చెప్పారు.
దీనిపై జేమ్స్ కామెరూన్ సరదాగా స్పందిస్తూ, “అయితే ఇంకా చాలానే సమయం ఉంది. ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటే, ఉదాహరణకు పులులు లాంటి సీన్లు ఉంటే నాకు చెప్పండి” అని అన్నారు.
రాజమౌళి కూడా వెంటనే స్పందిస్తూ, జేమ్స్ కామెరూన్ వరణాసి సినిమా సెట్స్‌కు రావడం తనకు మాత్రమే కాదు, మొత్తం భారత సినిమా రంగానికే గౌరవంగా ఉంటుందని చెప్పారు. ఈ మాటలకు జేమ్స్ కామెరూన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “నాకు అవకాశం దొరికితే నేను కూడా కెమెరా పట్టి, కొన్ని సెకండ్ యూనిట్ షాట్స్ తీయాలని ఉంది” అని అన్నారు.
ఈ ఇద్దరు గొప్ప దర్శకుల మధ్య జరిగిన ఈ సరదా, ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవైపు భారత సినిమా, మరోవైపు హాలీవుడ్.. ఈ రెండు ప్రపంచాలను కలిపేలా ఈ సంభాషణ ఉండటం ప్రత్యేకంగా మారింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వరణాసి’ సినిమాపై దీనితో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.
Follow Us