లైంగిక వేధింపుల కేసులో.. జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్! లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు జానీకి ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. By Archana 03 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Jani Master షేర్ చేయండి Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అతని దగ్గర పనిచేసే మహిళా అసిస్టెంట్ ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అత్యాచార కేసులో గత 15 రోజులుగా పోలీసుల కస్టడీలో చెంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు కాస్త ఊరట లభించింది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టు జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే జానీ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో.. అవార్డు తీసుకోవడం కోసం అతనికి బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళ్ ఫిల్మ్ 'తిరుచిత్రంబలం' లో "మేఘం కారుక్కత" పాటకు జానీకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వరించింది. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు అయితే జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్.. జానీ గత కొన్నాళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని సెప్టెంబర్ 18న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ ఆమె పై వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉన్న జానీని పోలీసులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు అడిగారు. యువతికి 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడ్డావా? షూటింగ్ సమయంలో క్యారవ్యాన్ లో వేధించావా..? ముంబై హోటల్ లో అర్థరాత్రి టైంలో యువతి రూమ్ కి వెళ్ళావా..? మతం మార్చుకోమని తనను ఒత్తిడి చేశావా..? నాలుగేళ్ళ నుంచి యువతి పై అత్యాచారం చేస్తున్నావా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ జానీ మాత్రం పోలీసులు అడిగే ప్రశ్నలకు పొంతనలేని సమాదానాలు ఇచ్చినట్లు సమాచారం. Also Read: కొండా సురేఖపై స్మిత సబర్వాల్ సంచలన పోస్టు.. ఏం అన్నారంటే? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి