/rtv/media/media_files/2026/01/07/rajasaab-bookings-2026-01-07-13-24-28.jpg)
Rajasaab Bookings
Rajasaab Bookings: టాలీవుడ్‌లో సంక్రాంతి 2026 సినిమాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొన్ని సినిమాలకే పరిమితం చేస్తూ స్పష్టత ఇచ్చింది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/07/peoples-media-factory-2026-01-07-13-27-20.jpeg)
హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, టికెట్ ధరల పెంపుపై ఉన్న ఆంక్షలు పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 సినిమాలకే వర్తిస్తాయని పేర్కొంది. దీంతో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాలకు ఆ అడ్డంకులు వర్తించవని స్పష్టమైంది. ఈ నిర్ణయంతో రెండు సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన సందడి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా విడుదలైన ‘రాజా సాబ్ 2.0’ ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. ఇంతటి అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అవుతోంది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/07/peoples-media-factory-2026-01-07-13-27-45.jpeg)
అయితే, సినిమా విడుదలకు దగ్గరపడుతున్న వేళ నైజాం ఏరియాలో థియేటర్ల కేటాయింపుపై ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మొత్తం సింగిల్ స్క్రీన్లలో ‘ది రాజా సాబ్’కు కేవలం 22 థియేటర్లనే కేటాయించారని టాక్ వినిపిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కూడా సంధ్య 75 MM, 35 MM థియేటర్లకే పరిమితం చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
ఇదే సమయంలో, తమిళ సినిమా ‘జన నాయగన్’ కు నైజాంలో ఎక్కువ థియేటర్లు కేటాయించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో కూడా తెలుగు సినిమాల కంటే ఆ సినిమాకు ఎక్కువ షోలు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రవితేజ, శర్వానంద్ నటించిన సినిమాలకు కూడా నైజాంలో చాలా తక్కువ థియేటర్లు మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ అయినప్పటికీ పెద్ద హీరోల సినిమాలకు సరైన స్క్రీన్లు ఇవ్వకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
మొత్తానికి, హైకోర్టు నిర్ణయంతో టికెట్ ధరల విషయంలో ‘రాజా సాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాలకు ఊరట లభించినా, థియేటర్ల పంపిణీ విషయంలో మాత్రం ఇంకా అసంతృప్తి కొనసాగుతోంది. ఈ సమస్యలు పరిష్కారమైతేనే సంక్రాంతి బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో వేడెక్కే అవకాశం ఉంది.
Follow Us