NANI: హీరో నాని షూటింగ్ లో విషాదం.. మహిళ మృతి!

నాని హీరోగా నటిస్తున్న 'హిట్ 3' సినిమా షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ లో సినిమా షూట్ జరుగుతుండగా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న KR క్రిష్ణ అనే మహిళా గుండె పోటుతో మృతి చెందింది.

New Update
hit 3 nani

hit 3 nani

NANI:  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హిట్ 3'.  యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను హిట్ యూనివర్స్ లో ఇప్పటికే రిలీజైన హిట్, హిట్ 2 సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.  దీంతో 'హిట్ 3' పై భారీ హైప్ నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్ అనే రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !

షూటింగ్ లో విషాదం.. 

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ లో సినిమా షూట్ జరుగుతుండగా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న KR క్రిష్ణ అనే మహిళ కు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో చిత్రబృందం వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు

ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ  శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.  'KGF'లో తన అందంతో పాటూ నటనతోనూ ఆకట్టుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గతంలో సెట్స్ పై నుంచి నాని, శ్రీనిధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సినిమాతో పాటు నాని శ్రీకాంత ఓదెల దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది.  గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో అలరించిన ఈ హీరో.. ఇటీవల 'సరిపోదా శనివారం' తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు