/rtv/media/media_files/2025/10/22/prabhas-birthday-special-2025-10-22-13-28-50.jpg)
Prabhas Birthday Special
Happy Birthday Prabhas: ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. “బాహుబలి”(Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఇప్పుడు ఒక్క సినిమా చేస్తేనే వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. “సలార్”, “కల్కి 2898 AD” సినిమాల విజయాలతో ఆయన స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఒకప్పుడు సాదాసీదా హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్, ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా నిలిచారు. అయితే ఈ స్థాయికి ఎదిగిన ప్రభాస్ తన తొలి సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా? ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఈశ్వర్ మూవీతో కెరీర్ ప్రారంభం.. Eeswar Movie Remunaration
2002 నవంబర్ 11న విడుదలైన “ఈశ్వర్” సినిమా ద్వారానే ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేశారు. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలో ప్రభాస్ కొత్త హీరో. ఆయన కుటుంబం సినీ నేపథ్యానికి చెందినదైనా, మొదటి సినిమా కాబట్టి ఎక్కువ పారితోషికం తీసుకోలేదు.
ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ స్వయంగా ఈ విషయం తెలిపారు ఆయన మాట్లాడుతూ, “ఈశ్వర్” కోసం ఆయనకు కేవలం రూ. 4 లక్షలు మాత్రమే ఇచ్చారట! ఆ సమయంలో అది పెద్ద మొత్తంగా కాకపోయినా, ఆ ప్రారంభం ప్రభాస్ జీవితాన్ని మార్చేసింది. సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ, ప్రభాస్ నటనకు మంచి పేరు వచ్చింది.
హిట్‌లు, ఫ్లాప్‌ల మధ్య ముందుకు సాగిన ప్రయాణం
“వర్షం”, “ఛత్రపతి”, “బుజ్జిగాడు”, “మిర్చి”, “మిస్టర్ పర్ఫెక్ట్” వంటి సినిమాలతో ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. కొన్నిసార్లు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌డమ్..
2015లో విడుదలైన రాజమౌళి దర్శకత్వంలోని “బాహుబలి” సినిమా ప్రభాస్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ మూవీతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి కోసం ఆయన దాదాపు రూ. 25 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం.
తర్వాత ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. “సాహో”, “రాధే శ్యామ్”, “ఆది పురుష్” వంటి సినిమాలు పెద్దగా నడవకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం మరింత పెరిగింది.
ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకు తీసుకునే పారితోషికం వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. “సలార్ పార్ట్ 1” కోసం ఆయన దాదాపు రూ. 120 కోట్లు, “కల్కి 2898 AD” కోసం అయితే రూ. 150 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని టాక్ ఉంది.
అంటే 2002లో 4 లక్షల రూపాయలతో ప్రారంభమైన ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రయాణం, ఇప్పుడు వందల కోట్లకు చేరింది. ఇది ఆయన కష్టానికి, క్రమశిక్షణకు, అభిమానుల ప్రేమకు నిదర్శనం అని చెప్పాలి.
సినిమాలు సక్సెస్ అయినా, ఫ్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆయన సింపుల్ నేచర్, అభిమానుల పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆయనకు ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, fauzi వంటి పలు భారీ సినిమాలు ఉన్నాయి.
4 లక్షలతో మొదలైన ప్రభాస్ ప్రయాణం ఇప్పుడు 150 కోట్ల పారితోషికం తీసుకుంటూ దేశంలో టాప్ హీరోల సరసన నిలిచాడు. చిన్న సినిమా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కథ నిజంగా అందరికీ స్పూర్తినిచ్చేలా ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్!!
Follow Us