GV Prakash Divorce: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్..

GV ప్రకాష్ కుమార్, సైన్ధవి తమ 12 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలికారు. వారి కూతురు అన్వికి సైన్ధవి కస్టడీ పొందగా, ఇద్దరూ కలిసి తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం అభిమానులను షాక్ కి గురి చేసింది.

New Update
GV Prakash Divorce

GV Prakash Divorce

GV Prakash Divorce: తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న GV ప్రకాష్ కుమార్, ప్రముఖ గాయని సైన్ధవి తమ 12 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. చెన్నై ఫ్యామిలీ కోర్ట్‌లో వీరి విడాకులు పూర్తి అయ్యాయి.

స్నేహితుల నుంచి జీవిత భాగస్వాములుగా...

GV ప్రకాష్, సైన్ధవి ఇద్దరూ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. స్కూల్ రోజుల నుంచే వారి మధ్య ఉన్న బంధం, క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వారు 2013లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఇద్దరూ కలిసి మ్యూజిక్ వేదికలపై కలిసి పాడడం, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

వారికి 2020లో అన్వి అనే కూతురు పుట్టింది. ఆ చిన్నారి కోసం ఇప్పుడు కూడా ఇద్దరూ బాధ్యతగా కో పేరెంటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరూ గత ఏడాది మే 13, 2024న తమ విడిపోయే నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ ప్రకటన తర్వాత వారు డిసెంబర్ 2024లో జరిగిన GV ప్రకాష్ సంగీత కార్యక్రమంలో కలిసి స్టేజ్ పంచుకున్నారు. విడాకుల కోసం 2025 మార్చిలో దరఖాస్తు చేసుకున్న వారు, కోర్టు విధించిన ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అనంతరం అధికారికంగా విడిపోయారు.

విడాకుల ప్రక్రియలో భాగంగా, కూతురు అన్వి కస్టడీ సైన్ధవికే ఇవ్వడం జరిగింది. అయితే, GV ప్రకాష్ కూడా తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తూ, ఇద్దరూ కలిసి అన్వి భవిష్యత్తు కోసం శ్రద్ధ తీసుకుంటామని వెల్లడించారు. ఈ పరిణామం వారికి దగ్గరగా ఉన్న అభిమానులను కొంత బాధపెట్టినా, వారి పరిణితితో కూడిన నిర్ణయాన్ని మరి కొంతమంది మెచ్చుకుంటున్నారు.

విడిపోతున్నప్పటికీ ఇద్దరూ తమ కెరీర్‌లో కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టుతున్నారు. GV ప్రకాష్ ప్రస్తుతం నటన, సంగీతం రెండింటినీ సమానంగా చేస్తుండగా, సైన్ధవి తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితం వేరైనప్పటికీ, సంగీతం మాత్రం వీరిద్దరినీ కలిపే సాధనగా మారుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

Advertisment
తాజా కథనాలు