2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్’ సినిమాలో మొదటి సారి జెనీలియా, రితేష్ కలిసి వర్క్ చేశారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత వీరిద్దరూ దాదాపు పదేళ్లు డేటింగ్ లో ఉన్నారు. 2012లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా తాము డేటింగ్ లో ఉన్నప్పుడు భర్త రితేష్ చేసిన ఓ మర్చిపోలేని సంఘటనను గుర్తుచేసుకున్నారు. రితేష్ ఒక రోజు తనకు అర్ధరాత్రి 1 గంటకు 'అంతా అయిపోయింది అంటూ' ఓ బ్రేకప్ మెసేజ్ పంపినట్లు తెలిపింది.
ఉదయాన్నే ఆ మెసేజ్ చూసి తాను షాకయ్యానని. చాలా బాధగా అనిపించిందని. ఏం జరిగిందో? అర్థం కాక సతమతమైనట్లు చెప్పింది. కానీ రితేష్ మాత్రం తాను రాత్రి పంపిన మెసేజ్ గురించి పూర్తిగా మర్చిపోయి ఉదయాన్నే ఫోన్ చేసి 'ఏం చేస్తున్నావు?' అని అడగడంతో జెనిలీయాకు చాలా కోపం వచ్చిందట. ఇక పై మనం మాట్లాడుకోవడం మంచిది కాదని రితేష్ పై అరిచేసిందట. దీంతో రాత్రి తాను పంపిన బ్రేకప్ మెసేజ్ గురించి గుర్తుచేసుకున్న రితేష్.. తాను కేవలం జోక్‌గా ఆ మెసేజ్ పంపినట్లు జెనీలియాకు చెప్పారట. ఇలా రితేష్ తన పై ప్రాంక్ గురించి గుర్తుచేసుకున్నారు.
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైన జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ తో వివాహం అనంతరం ఆమె ముంబై లోనే సెటిల్ అయ్యారు.
సినీ ప్రియుల్లో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సరదాగా కపుల్ రీల్స్, వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు.