నికితా పోర్వాల్ పురాణాలు, సాంస్కృతిక వారసత్వంతో కూడిన ఉజ్జయిని నగరంలో జన్మించింది. కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన నిఖిత... ప్రస్తుతం బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. Image Credits: Nikita Porwal/Instagram
నిఖితకు కథలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ కూడా. కళలలు, నాటకాలు అంటే విపరీతమైన ఇష్టం ఉన్న నిఖిత 60కి పైగా నాటకాల్లో తన ప్రదర్శనను ఇచ్చింది. 'కృష్ణ లీల' అనే పేరుతో స్వయంగా 250 పేజీల నాటకాన్ని రాసి రచయితగా కూడా తన ప్రతిభను ప్రదర్శించింది. Image Credits: Nikita Porwal/Instagram
18 ఏళ్ల వయసులోనే కెరీర్ను ప్రారంభించిన నిఖిత... మొదట టీవీ యాంకర్ గా పనిచేసింది. ఆ తరువాత చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టింది. తాను మొదటగా నటించిన 'చంబల్ పార్' చిత్రాన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. Image Credits: Nikita Porwal/Instagram
అక్టోబర్ 16న ముంబైలోని ఫేమస్ స్టూడియోలో జరిగిన మిస్ ఇండియా 2024 పోటీల్లో ప్రతి రాష్ట్రం నుంచి 30 మంది పోటీదారులు పాల్గొనగా.. నిఖిత మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. రేఖా పాండే, ఆయుశీ దోలకియా ఫస్ట్, సెకండ్ రన్నరప్ లుగా నిలిచారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న నిఖిత నెక్స్ట్ జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. Image Credits: Nikita Porwal/Instagram
నిఖితకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆమె యానిమల్ వెల్ఫేర్ స్పెసలిస్ట్ కూడా. అన్ని జీవుల పట్ల కరుణతో ఉండాలని తన ఉండాలనే అంశాన్ని ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే నిఖితకు ఐశ్వర్యారాయ్ అంటే ఎంతో ఇష్టం. ఆమెను తన ఆరాధ్య దైవంగా చెబుతుంది. Image Credits: Nikita Porwal/Instagram
సినిమాల్లో కూడా తన నైపుణ్యాలను ప్రదర్శించాలనుకుంటున్న నిఖితకు.. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నటించాలని, ఆయనతో కలిసి పనిచేయాలని ఉందని తన కోరికను తెలిపింది. Image Credits: Nikita Porwal/Instagram