Soubin Shahir: 'కూలీ' నటుడిపై చీటింగ్ కేసు..  కోర్టు సంచలన తీర్పు!

'మంజుమ్మల్ బాయ్స్'  ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ కి ఎర్నాకులం కోర్ట్ షాకిచ్చింది. గతంలో ఆయనపై నమోదైన చీటింగ్ కేసులో కీలక తీర్పును ఇచ్చింది.

New Update
Soubin Shahir as Dayal

Soubin Shahir as Dayal

Soubin Shahir: 'మంజుమ్మల్ బాయ్స్',  'కూలీ'  చిత్రాలతో పేరు పొందిన  ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ కి ఎర్నాకులం కోర్ట్ షాకిచ్చింది. గతంలో ఆయనపై నమోదైన చీటింగ్ కేసులో కీలక తీర్పును ఇచ్చింది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయి వేదికగా జరగబోయే సైమా ఈవెంట్ కి హాజరయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ సౌబిన్  పిటీషన్ దాఖలు చేయగా.. దానిని న్యాయస్థానం కొట్టివేసింది. అనుమతి ఇవ్వాలనే అతడి అభ్యర్థనను తిరస్కరించింది. 

అసలు కేసేంటి.. 

సౌబిన్  'మంజుమ్మల్ బాయ్స్' సినిమా నిర్మాణంలో మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  సౌబిన్, అతడి తండ్రితో పాటు మరొక వ్యక్తి  కలిసి  ఈ సినిమాను నిర్మించారు.  అయితే ఈ సమయంలో సిరాజ్ అనే వ్యక్తి   సినిమా కోసం ₹7 కోట్లు పెట్టుబడి పెట్టగా.. సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారట. కానీ, సినిమా పెద్ద విజయం సాధించినప్పటికీ లాభాల్లో వాటా ఇవ్వలేదని సిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఎర్నాకులం పోలీసులు సౌబిన్,  ఇతరుల నిర్మాతలపై  పై చీటింగ్  కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో సౌబిన్ కి మధ్యంతర బెయిల్ మంజూరు అయినప్పటికీ.. కేసు విచారణ ఇంకా కొనసాగుతోనే ఉంది.  ఈ క్రమంలోనే  సౌబిన్ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయిలో జరగబోయే సైమా ఈవెంట్ కి హాజరయ్యేందుకు కోర్టును అనుమతి కోరగా తిరస్కరించింది. కేసు ఇంకా విచారణలోనే ఉందని.. కేసుకు సంబంధించిన ఒక కీలక సాక్షి కూడా దుబాయిలోనే ఉన్నాడని, ఈలోపు సౌబిన్ విదేశాలకు వెళ్తే సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు సౌబిన్ విదేశీ ప్రయాణాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 

సౌబిన్ తరపు న్యాయవాది కూడా పలు వాదనలను వినిపించారు. అతడు ఒక ప్రముఖ నటుడని, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ అంతర్జాతీయ వేదికలపై మలయాళ చిత్రపరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తారని వాదించారు. సైమా ఈవెంట్ కి ఆయన హాజరైతే మలయాళ చిత్ర పరిశ్రమకు గౌరవం అని తెలిపారు. అంతేకాకుండా ఆయన ఒక బాధ్యత గల నటుడని.. కోర్టు అనుమతిస్తే ఈవెంట్ కి హాజరై వెంటనే తిరిగి వస్తారని వాదించారు. అయినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. దీంతో సౌబిన్ కి నిరాశే  ఎదురైంది. ఇదిలా ఉంటే.. సౌబిన్ రీసెంట్ గా రజినీకాంత్  'కూలీ' మోనికా సాంగ్ తో సంచలనం సృష్టించాడు.  ఈ పాటతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు.  

Also Read: Gama Awards 2025: గామా అవార్డ్స్‌లో ‘పుష్ప’ సంచలనం.. ఒకటి కాదు రెండు కాదు - అవార్డులే అవార్డులు..

Advertisment
తాజా కథనాలు