ఈ వారం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ .. ఏకంగా 5 సినిమాలు విడుదల..!

ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ', సన్నీ లియోన్ 'మందిర', రాకింగ్ రాకేష్ 'కేశవ చంద్ర రామావత్', ప్రశాంత్ వర్మ 'దేవకీ నందన వాసుదేవ' చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

New Update

Movies:  ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఏకంగా 5 చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం 

ఈ వారం సినిమాలు 

కేశవ చంద్ర రామావత్ 

 కమెడియన్ రాకింగ్ రాకేష్ మెయిన్ లీడ్ గా ఆయన సొంత నిర్మాణంలో రూపొందిన చిత్రం 'కేశవ చంద్ర రామావత్'. ఈ మూవీని గరుడవేగ అంజి తెరకెక్కించారు. బంజారా యువకుడి జీవిత కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాకింగ్ రాకేష్ సరసన అనన్యకృష్ణన్‌ కథానాయికగా నటించింది. 

మందిర

సన్నీ లియోన్ ఫిమేల్ లీడ్ గా తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ కామెడీ 'మందిర'. ఆర్‌.యువన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సన్నీ లియోన్ యువరాణి పాత్రలో నటించింది. 

మెకానిక్ రాకీ 

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ  ముళ్ళపూడి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రద్ధ శ్రీనాథ్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. 

దేవకీ నందన వాసుదేవ

'హనుమాన్'  ఫేమ్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో రూపొందిన 'దేవకీ నందన వాసుదేవ' చిత్రాన్ని అర్జున్‌ జంధ్యాల తెరకెక్కించారు. ఈ చిత్రంలో అశోక్ గల్లా,  మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం కూడా నవంబర్ 22న థియేటర్స్ లో విడుదల కానుంది. 

 రోటి కపడా రొమాన్స్‌

 హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం  'రోటి కపడా రొమాన్స్‌'. ఈ మూవీ కూడా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

డిస్నీ హాట్ స్టార్

  • ఇంటీరియర్‌ చైనా టౌన్‌ ( నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్) 
  • కిష్కిందకాండమ్‌: నవంబర్ 21 నుంచి 
  • అవుట్‌ ఆఫ్‌ మై మైండ్‌: నవంబర్ 21 నుంచి 
     
  • జియో సినిమా: బ్యాక్‌ టు బ్లాక్‌ ( నవంబర్ 17 నుంచి)
  • నెట్ ఫ్లిక్స్: నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌
  • అమెజాన్ ప్రైమ్: క్యాంపస్ బీట్స్ 2 ( నవంబర్ 20నుంచి) 

Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు