Ott Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సినిమాల పండగ..! లిస్ట్ ఇదే

ఈ వారం థియేటర్ తో పాటు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి అదిరిపోయే సినిమాలు సిద్ధమయ్యాయి. 'శ్వాగ్‌', 'చిట్టి పొట్టి', 'దక్షిణ', 'కలి', 'బహిర్భూమి', 'దక్షిణ' సహా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి.

New Update
ott movies (1)

ott movies

This Week Movies:  ఈవారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. వీటికి సంబంధించిన విడుదల తేదీలు, ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం 

ఈ వారం థియేటర్ మూవీస్ 

బహిర్భూమి

ర్యాప్ సింగర్ నోయల్, రిషిత లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బహిర్భూమి'. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న థియేటర్స్ లో విడుదల కానుంది. 

దక్షిణ

'కబాలి' చిత్రంలో రజినీకాంత్ కూతురిగా  పాపులరైన సాయిధ‌న్సిక‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సైకో థ్రిల్లర్ 'దక్షిణ'. ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మంత్ర', 'మంగళ', చిత్రాల ఫేమ్ తులసి రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

శ్వాగ్‌
 
శ్రీవిష్ణు - రీతూ వర్మ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ  ‘శ్వాగ్‌’. హసిత్‌ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీ విష్ణు నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

చిట్టి పొట్టి 

రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి  లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'చిట్టి పొట్టి'. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 3 థియేటర్స్ లో విడుదల కానుంది. 

కలి

ప్రిన్స్, నరేష్ అగస్త్య  ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కలి'. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపత్యంలో రూపొందిన ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓటీటీ సినిమాలు 

  • బాలుగాని టాకీస్‌: ఆహా (అక్టోబరు 04)
  • 35 చిన్న కథ కాదు:  ఆహా  (అక్టోబరు 02)
  • ఆనందపురం డైరీస్‌: జియో సినిమా (అక్టోబరు 04)
  • హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌: అమెజాన్‌ ప్రైమ్‌ (అక్టోబరు 3)
  • CTRL (హిందీ) : నెట్ ఫ్లిక్స్ (అక్టోబరు 04)
  • ది సిగ్నేచర్‌: జీ 5 ( అక్టోబరు 04)
Advertisment
Advertisment
తాజా కథనాలు