Legacy of Raja Saab: గ్లోబల్ ఆడియెన్స్‌ టార్గెట్ గా ‘లెగసి ఆఫ్ రాజా సాబ్’.. కాన్సెప్ట్ అదిరింది భయ్యా!

‘ది రాజా సాబ్’ నుండి ‘లెగసి ఆఫ్ రాజా సాబ్’ ఇంట్రో వీడియో రిలీజ్ చేసాడు డైరెక్టర్ మారుతి. సినిమా నెల రోజుల్లో విడుదల కానుండటంతో ప్రమోషన్లు మొదలవుతున్నాయి. సంక్రాంతికి ముందుగా వచ్చే సినిమా కావడంతో మంచి వసూళ్ల రాబట్టే అవకాశం ఉంది.

New Update
Legacy of Raja Saab

Legacy of Raja Saab

Legacy of Raja Saab: ‘లెగసి ఆఫ్ రాజా సాబ్’ ఇంట్రో వీడియో రిలీజ్ కావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘ది రాజా సాబ్’ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందో అని అభిమానులు కొంతకాలంగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కారణం, ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం. అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి అప్డేట్‌ను ఫ్యాన్స్ జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ఇటీవల సినిమా నుంచి కొన్ని వార్తలు వచ్చినా, అభిమానుల్లో చిన్న సందేహం మాత్రం అలాగే ఉంది. అయితే సినిమా మరోసారి వాయిదా పడదని మేకర్స్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి తాజాగా ‘వెల్కమ్ టు లెగసి ఆఫ్ రాజా సాబ్’ అనే ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో అభిమానులకు కాస్త లభించింది.

ఈ సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఇప్పుడు నుంచి ప్రమోషన్లు మొదలవుతున్నాయి.. ఆ ప్రమోషన్లలో భాగంగానే ఈ ఇంట్రో వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ‘రాజా సాబ్’ సినిమాలో నటించిన నటీనటులు, సినిమా ఎలా తెరకెక్కింది, మేకింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూపించనున్నారు. ఇవన్నీ గ్లోబల్ ఆడియెన్స్‌కు కూడా సులభంగా అర్థమయ్యేలా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.

సంక్రాంతి సీజన్‌లో ముందుగా విడుదల కానున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. పండుగ సీజన్ కావడంతో థియేటర్లలో మంచి వసూళ్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమా కావడంతో హైప్ కూడా భారీగానే ఉంది.

ఇప్పటికే విడుదలైన ఈ ఇంట్రో వీడియోతో సినిమా మీద మళ్లీ చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్, పాటలు, ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు ఇప్పుడు వాటి కోసం ఎదురుచూస్తున్నారు.

మరి ‘లెగసి ఆఫ్ రాజా సాబ్’ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్స్‌లో తెలియజేయండి.

Advertisment
తాజా కథనాలు